logo

రైలు ఇంజిన్ల నిర్వహణలో కొత్తపుంతలు

వాల్తేరు డివిజన్‌ పరిధిలోని విశాఖలో రైలు ఇంజిన్‌(లోకోమోటివ్‌)ల నిర్వహణ చేపట్టే లోకోషెడ్డు విస్తరణ పనులు పూర్తయ్యాయి. ఎలక్ట్రికల్‌ రైలు ఇంజిన్ల నిర్వహణ వేగవంతం అయ్యేలా నూతనంగా ఏర్పాటు చేసిన

Published : 28 May 2022 04:14 IST

400వ ఇంజిన్‌ నిర్వహణ ప్రారంభోత్సవంలో డీఆర్‌ఎం అనుప్‌ సత్పత్తి, వాల్తేరు రైల్వే అధికారులు

ఈనాడు, విశాఖపట్నం, న్యూస్‌టుడే, కరాస: వాల్తేరు డివిజన్‌ పరిధిలోని విశాఖలో రైలు ఇంజిన్‌(లోకోమోటివ్‌)ల నిర్వహణ చేపట్టే లోకోషెడ్డు విస్తరణ పనులు పూర్తయ్యాయి. ఎలక్ట్రికల్‌ రైలు ఇంజిన్ల నిర్వహణ వేగవంతం అయ్యేలా నూతనంగా ఏర్పాటు చేసిన విభాగంలో పలు పరికరాలను శుక్రవారం ప్రారంభించారు. డీఆర్‌ఎం అనుప్‌ సత్పతి పాల్గొన్న ఈ కార్యక్రమం తరువాత డీజిల్‌ లోకోషెడ్‌ ప్రాజెక్టుకు  సంబంధించిన ఫలకాన్ని కూడా ఆవిష్కరించారు.

ఈ ప్రాజెక్టులో భాగంగా: వాల్తేరు డివిజన్‌లోని విశాఖ లోకోషెడ్‌ సామర్థ్యం ఆసియాలోనే అతి పెద్ద వాటిలో ఒకటి. కొత్తవలస-కిరండూల్‌ మార్గంలో ఇనుప ఖనిజం రవాణా రైళ్ల ఇంజిన్ల నిర్వహణకు 1965లో 13 లోకోమోటివ్‌ల నిర్వహణ సామర్థ్యంతో ప్రారంభించారు. అంచెలంచెలుగా ఇది 776కు చేరింది. ఇందులో 400 డీజిల్‌ ఇంజిన్లు, 376 ఎలక్ట్రికల్‌ ఇంజిన్లు ఉన్నాయి.  ఈ రెండు విభాగాలకు వేర్వేరుగా లోకోషెడ్లు అందుబాటులో ఉన్నాయి. డీజిల్‌కు బదులుగా ఎలక్ట్రికల్‌ ఇంజిన్ల వాడకం పెంచాలని రైల్వేశాఖ నిర్ణయించడంతో విశాఖలో ఆధునిక సౌకర్యాలతో కూడిన లోకోషెడ్డును నిర్మించారు.2015-16లో ఈ ప్రాజెక్టుకు రూ. 65.02 కోట్లను కేటయించగా, పనులు పూర్తయ్యేసరికి ఖర్చు దాదాపు రూ. వంద కోట్లు దాటింది.భారీ క్రేన్లు, విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్లు, ఆధునిక సాంకేతికతో కూడిన భారీ పరికరాలు, వసతులు అందుబాటులోకి తెచ్చారు. వీటి సాయంతో ఒకేసారి పదుల సంఖ్యలో ఇంజిన్లను సర్వీసు చేయొచ్చు. విశాఖ డీజిల్‌ షెడ్డు 400వ ఇంజిన్‌ నిర్వహణ మైలురాయికి చేరిన సందర్భాన్ని పురస్కరించుకొని మర్రిపాలెం డీజిల్‌ లోకోషెడ్‌ ప్రాంగణంలో డీఆర్‌ఎం అనుప్‌ సత్పతి సాంకేతిక నిపుణుల సమక్షంలో ఆ ప్రక్రియను ప్రారంభించారు. అనంతరం డీజిల్‌ లోకోషెడ్‌ అదనపు భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని