logo

పర్యాటక హోటళ్లు కిటకిట!

వరుస సెలవులతో నగరానికి పర్యాటకుల తాకిడి పెరిగింది. దీంతో హోటళ్లలో గదులు ఖాళీ లేవు. దీంతో పలువురు సర్వీసు అపార్టుమెంట్లను అద్దెకు తీసుకుంటున్నారు. అరకు, అనంతగిరి, టైడా, లంబసింగి పర్యాటక ప్రాంతాలకు వచ్చే వారి సంఖ్య ఇటీవల అనూహ్యంగా పెరిగింది.

Published : 13 Aug 2022 04:35 IST

ఈనాడు, విశాఖపట్నం : వరుస సెలవులతో నగరానికి పర్యాటకుల తాకిడి పెరిగింది. దీంతో హోటళ్లలో గదులు ఖాళీ లేవు. దీంతో పలువురు సర్వీసు అపార్టుమెంట్లను అద్దెకు తీసుకుంటున్నారు. అరకు, అనంతగిరి, టైడా, లంబసింగి పర్యాటక ప్రాంతాలకు వచ్చే వారి సంఖ్య ఇటీవల అనూహ్యంగా పెరిగింది.

*  పర్యాటకులు ఎక్కువగా అనంతగిరి హరితా హిల్‌ రిసార్టు, టైడాలోని జంగిల్‌ బెల్స్‌, అరకులోని వ్యాలీ రిసార్టు, లంబసింగిలో బసకు ఆరా తీస్తున్నారు. దీంతో పర్యాటకశాఖ డీవీఎం బాబూజి ఆయా రిసార్టులలో పర్యాటకుల వసతుల కల్పనపై క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. డిమాండుకు తగ్గ సౌకర్యాలపై సిబ్బందికి మార్గనిర్దేశం చేశారు.

*  ఈ నేపథ్యంలో అక్కడున్న పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) రిసార్టులకు డిమాండు ఏర్పడింది. ఈ నెల 13 రెండో శనివారం, 14 ఆదివారం, 15 స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో వరుసగా సెలవులు వచ్చాయి. దీంతో అధిక శాతం మంది ఉద్యోగులు, ఇతర వర్గాలు విహార ఏర్పాట్లు చేసుకున్నారు.

*  స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ ఉద్యోగుల సంఘ ఎన్నికలు విశాఖలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి ఉద్యోగులు ఇక్కడికి తరలివచ్చారు. ఏపీటీడీసీకి విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో 200కు పైగా గదులు ఉన్నాయి.

*  అరకు, బొర్రా గుహలు, అనంతగిరి వెళ్లేందుకు చాలా మంది ప్రణాళిక చేసుకోవడంతో అక్కడ గదులకు డిమాండు ఏర్పడింది. 99 శాతం గదులు ఆన్‌లైన్‌లో ముందుగానే బుక్‌ అయిపోయాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని