logo

ప్రభుత్వం మరిచింది.. పరిశ్రమ పూడ్చింది

ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఏ ప్రాంతంలో అయినా పర్యటిస్తే ఇక్కడ పెండింగ్‌లో ఉన్న పనులను అధికారులు చకచకా పూర్తిచేయడం సాధారణంగా చూస్తూ ఉంటాం. అచ్యుతాపురం సెజ్‌లో ఏటీజీ టైర్ల తయారీ పరిశ్రమ ప్రారంభోత్సవానికి మంగళవారం ముఖ్యమంత్రి జగన్‌ రానున్నారు. ఈ ప్రాంతంలో చాలా గోతులున్నాయి.

Published : 13 Aug 2022 04:35 IST

మార్టూరు-సెజ్‌ రోడ్డులో గోతులను పూడ్పిస్తున్న టైర్ల కంపెనీ ప్రతినిధులు

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఏ ప్రాంతంలో అయినా పర్యటిస్తే ఇక్కడ పెండింగ్‌లో ఉన్న పనులను అధికారులు చకచకా పూర్తిచేయడం సాధారణంగా చూస్తూ ఉంటాం. అచ్యుతాపురం సెజ్‌లో ఏటీజీ టైర్ల తయారీ పరిశ్రమ ప్రారంభోత్సవానికి మంగళవారం ముఖ్యమంత్రి జగన్‌ రానున్నారు. ఈ ప్రాంతంలో చాలా గోతులున్నాయి. సీఎం కాన్వాయ్‌ వెళ్లడానికి ఇబ్బందిలేకుండా కంపెనీ వారే గోతులు పూడ్చారు. ప్రమాదకరమైన గోతులతో ఆధ్వానంగా ఉన్న మార్టూరు-సెజ్‌ రోడ్డులో కంపెనీ నిధులతో గోతులను పూడ్చే పనులను రెండు రోజులుగా నిర్వహిస్తున్నారు. కంపెనీని పరిశీలించడానికి వచ్చిన పరిశ్రమల శాఖ మంత్రి అమర్‌నాథ్‌ కాన్వాయ్‌ కొద్దిసేపు ఈ రోడ్డు పనుల వల్ల నిలిచింది. ముఖ్యమంత్రి దిగే హెలిప్యాడ్‌ నిర్మాణ పనులను కంపెనీ ఆవరణలోనే చేపడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని