logo

మొదటిగా ఆస్ట్రేలియాలో... చివరిగా ఉత్తర అమెరికాలో..

భారత స్వాతంత్య్ర అమృతోత్సవాల్లో భాగంగా దేశ నౌకాదళం ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా అంటార్కిటికా మినహా మిగిలిన ఆరు ఖండాల్లోని పలు దేశాల పోర్టుల్లో భారతీయ యుద్ధనౌకలపై జాతీయ జెండాలు ఎగురవేసేలా ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే.

Published : 15 Aug 2022 04:23 IST

నౌకాదళం ఆధ్వర్యంలో ప్రపంచ వ్యాప్తంగా జెండా వందనం

నౌకపై నేవీ సిబ్బంది ప్రదర్శన

గాజువాక, న్యూస్‌టుడే : భారత స్వాతంత్య్ర అమృతోత్సవాల్లో భాగంగా దేశ నౌకాదళం ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా అంటార్కిటికా మినహా మిగిలిన ఆరు ఖండాల్లోని పలు దేశాల పోర్టుల్లో భారతీయ యుద్ధనౌకలపై జాతీయ జెండాలు ఎగురవేసేలా ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఐఎన్‌ఎస్‌ సుమేధ నౌక ఆస్ట్రేలియాలోని పెర్త్‌ తీరానికి చేరిందని నేవీ వర్గాలు తెలిపాయి. సోమవారం కాలమానం ప్రకారం మిగిలిన చోట్ల కన్నా ముందుగా ఇక్కడి నౌకలోనే భారత జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని పేర్కొన్నాయి. అలాగే ఉత్తర అమెరికాలోని శాన్‌డియాగో (అమెరికా) చేరిన ఐఎన్‌ఎస్‌ సాత్పురా నౌకపై మిగిలిన ప్రాంతాల కన్నా చివరిగా జెండా వందనం జరుగుతుందని వివరించాయి. వేడుకల్లో భారత్‌తో పాటు, ఆయా దేశాల నేవీ సిబ్బంది పాల్గొంటారని వెల్లడించాయి. ఈ సందర్భంగా నౌకలపై సిబ్బంది ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని