logo

పిల్లల్లో సాహిత్య వికాసం తగ్గుతోంది

పిల్లల్లో సాహిత్య వికాసం తగ్గుతోందని ప్రజాస్వామిక రచయితల వేదిక(ప్రరవే) జాతీయ కార్యదర్శి, రచయిత కె.ఎన్‌.మల్లేశ్వరి పేర్కొన్నారు.

Published : 06 Feb 2023 04:45 IST

మాట్లాడుతున్న మల్లేశ్వరి

పరవాడ, న్యూస్‌టుడే: పిల్లల్లో సాహిత్య వికాసం తగ్గుతోందని ప్రజాస్వామిక రచయితల వేదిక(ప్రరవే) జాతీయ కార్యదర్శి, రచయిత కె.ఎన్‌.మల్లేశ్వరి పేర్కొన్నారు. ప్రరవే 7వ వార్షిక సదస్సు సందర్భంగా పరవాడ మండలం పి.భోనంగి సంస్కృతి గ్లోబల్‌ పాఠశాలలో నిర్వహిస్తున్న ‘బడి పిల్లలతో రచయితలు.. సాహిత్య రచనా కార్యశాల’ కార్యక్రమం ఆదివారంతో ముగిసింది. ఈ సందర్భంగా మల్లేశ్వరి మాట్లాడుతూ పిల్లలు పుస్తక పఠనం అలవాటుగా చేసుకోవాలన్నారు. ఆంధ్రజ్యోతి పత్రిక సంపాదకులు కె.శ్రీనివాస్‌ మాట్లాడుతూ బట్టీపట్టి చదవడం వల్ల విద్యార్థుల్లో సామర్థ్యం తగ్గుతోందని, పిల్లలతో వ్యాసాలు రాయించడం అలవాటు చేయాలన్నారు. కార్యశాలలో ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల విద్యార్థులు కలిసి పాల్గొనడం వల్ల వారిమధ్య హెచ్చుతగ్గులు ఉండవని ఇది సమానత్వానికి ప్రతీక అన్నారు. పిల్లలను సన్మార్గంలో నడిపించడానికి ఈ కార్యశాల ఎంతో దోహదపడుతుందన్నారు. ఇటువంటి కార్యక్రమం చేపట్టినందుకు పాఠశాల ఛైర్మన్‌ పి.సూర్యనారాయణరెడ్డికి అభినందనలు తెలిపారు. ఆమెపథం(కవిత్వం), తొలిఅడుగు(విమర్శ) పుస్తకాలను ఆవిష్కరించారు. సాహితీవేత్తలు రాజ్యలక్ష్మి, కాత్యాయనివిద్మహే, శాంతిప్రభోద, షీలాసుభద్రదేవి, కె.శ్యామల, ఐ.జానకిబాల, వనజ, వేణుగోపాల్‌, శ్రీలక్ష్మి, పాఠశాల సీఈవో నిశాంత్‌ పాల్గొన్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని