జీవీఎంసీ పట్టణ ప్రధాన ప్రణాళికాధికారిణిగా సునీత
మహా విశాఖ నగరపాలక సంస్థ పట్టణ ప్రధాన ప్రణాళికాధికారి బి.సురేష్‌కుమార్‌ను అమరావతిలోని డైరెక్టర్ టౌన్ అండ్ కంట్రీప్లానింగ్(డీటీసీపీ) కార్యాలయం అదనపు సంచాలకులుగా ప్రభుత్వం బదిలీ చేసింది.
వీఎంఆర్‌డీఏ సీయూపీగా సంజయ్ రత్నకుమార్
సునీత
కార్పొరేషన్, న్యూస్‌టుడే: మహా విశాఖ నగరపాలక సంస్థ పట్టణ ప్రధాన ప్రణాళికాధికారి బి.సురేష్‌కుమార్‌ను అమరావతిలోని డైరెక్టర్ టౌన్ అండ్ కంట్రీప్లానింగ్(డీటీసీపీ) కార్యాలయం అదనపు సంచాలకులుగా ప్రభుత్వం బదిలీ చేసింది. మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖ గురువారం విడుదల చేసిన బదిలీ ఉత్తర్వుల ప్రకారం డీటీసీపీలో అదనపు సంచాలకులుగా పనిచేస్తున్న వి.సునీతను జీవీఎంసీ పట్టణ ప్రధాన ప్రణాళికాధికారిణిగా నియమించారు. వీఎంఆర్‌డీఏ చీఫ్ అర్బన్ ప్లానర్(సీయూపీ)గా విధులు నిర్వహిస్తున్న ఎ.ప్రభాకర్‌ను డీటీసీపీ కార్యాలయానికి బదిలీ చేసి ఏపీసీఆర్‌డీఏ అదనపు సంచాలకులుగా విధులు అప్పగించారు. జీవీఎంసీలో ఉప ప్రణాళికాధికారిగా విధులు నిర్వహిస్తున్న కె.సంజయ్ రత్నకుమార్‌ను వీఎంఆర్‌డీఏ చీఫ్ అర్బన్ ప్లానర్‌గా బదిలీ చేశారు.
* బుడా(బొబ్బిలి అర్బన్ డెవలప్‌మెంట అథారిటీ) కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న డి.లక్ష్మి, శ్రీకాకుళం అర్బన్ డెవలప్‌మెంట అథారిటీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న బి.రవణమ్మ, పార్వతీపురం కో-ఆపరేటివ్ అధికారి బి.సన్యాసినాయుడును మహా విశాఖ నగరపాలక సంస్థ యూసీడీ ప్రాజెక్టు అధికారులుగా నియమిస్తూ ఉత్తర్వులు విడుదలయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Intresting News today: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Hyderabad: ప్రముఖ హోమియో వైద్య నిపుణుడు సోహన్‌సింగ్ జోషి మృతి
-
Chandrababu Arrest: చంద్రబాబుకు మద్దతుగా కూకట్‌పల్లిలో నిరసనలు
-
Missing Children: తొమ్మిదేళ్లలో 4.46 లక్షల చిన్నారుల ఆచూకీ లభ్యం: స్మృతీ ఇరానీ
-
Hyderabad: తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టనున్న సింటెక్స్ సంస్థ
-
Income tax refund: ఆదాయపు పన్ను రిఫండ్స్.. ఐటీ శాఖ కీలక సూచన