logo

సీఎం రమేశ్‌ గెలుపుతో పారిశ్రామిక వృద్ధి

అనకాపల్లి ఎంపీగా సీఎం రమేశ్‌ గెలుపుతో పారిశ్రామికంగా జిల్లా అభివృద్ధి చెందుతుందని సినీ నిర్మాత నట్టి కుమార్‌ పేర్కొన్నారు. చోడవరంలో శనివారం విలేకరులతో మాట్లాడుతూ..

Published : 05 May 2024 03:46 IST

చోడవరం పట్టణం, న్యూస్‌టుడే: అనకాపల్లి ఎంపీగా సీఎం రమేశ్‌ గెలుపుతో పారిశ్రామికంగా జిల్లా అభివృద్ధి చెందుతుందని సినీ నిర్మాత నట్టి కుమార్‌ పేర్కొన్నారు. చోడవరంలో శనివారం విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారంలో సీఎం రమేశ్‌కు మద్దతుగా పాల్గొంటున్నానని, కూటమి అభ్యర్థులకు ప్రజాదరణ బాగుందన్నారు. ఎమ్మెల్యేగా పదేళ్లు, ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్‌ శాఖా మంత్రిగా రెండున్నరేళ్లు పనిచేసిన బూడి ముత్యాలనాయుడు అనకాపల్లి జిల్లాకు ఏం చేశారో చెప్పాలని డిమాండు చేశారు. చోడవరం నుంచి అనకాపల్లి వెళ్లే రోడ్డు ఎంత దారుణంగా ఉందో అందరికీ తెలిసిందేనని అన్నారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడని ముత్యాలనాయుడు పార్లమెంటుకు వెళ్లి ఏం మాట్లాడతారన్నారు. ఓటమి ఖాయమని తెలిసే కుమారుడు, బావమరిదితో గొడవ పడి దాడులకు దిగారని, తారువ ఆయన జాగీరు కాదని పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్‌ వెంటనే స్పందించి ఎంపీ అభ్యర్థిగా ముత్యాలనాయుడును అనర్హుడిగా ప్రకటించాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని