logo

‘భూయాజమాన్య హక్కు చట్టాన్ని రద్దు చేస్తాం’

తెదేపా అధికారంలోకి రాగానే భూయాజమాన్య హక్కు చట్టాన్ని రద్దు చేస్తామని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు హామీ ఇచ్చారు. బలిఘట్టం గాంధీబొమ్మ సెంటర్‌లో శనివారం రాత్రి ప్రచార సభలో ప్రసంగిస్తూ..

Published : 05 May 2024 03:47 IST

బలిఘట్టంలో ప్రసంగిస్తున్న అయ్యన్న

నర్సీపట్నం అర్బన్‌, న్యూస్‌టుడే: తెదేపా అధికారంలోకి రాగానే భూయాజమాన్య హక్కు చట్టాన్ని రద్దు చేస్తామని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు హామీ ఇచ్చారు. బలిఘట్టం గాంధీబొమ్మ సెంటర్‌లో శనివారం రాత్రి ప్రచార సభలో ప్రసంగిస్తూ.. సీఎం జగన్‌ తీరుపై మండిపడ్డారు. బలిఘట్టం నుంచి ధర్మసాగరానికి రోడ్డు, వంతెన నిర్మాణానికి తెదేపా అధికారంలో ఉన్నప్పుడు నిధులిచ్చాం. వైకాపా ప్రభుత్వం వంతెన పనులను రద్దు చేసింది.  కల్యాణ మండపాన్ని పైకప్పు వరకు పూర్తి చేస్తే దాన్నీ ఆపేశారన్నారు. వీటన్నింటిపై ఎమ్మెల్యే గణేశ్‌ను నిలదీయాలని పిలుపునిచ్చారు. సత్యనారాయణస్వామి ఆలయ కమిటీ ఛైర్మన్‌ శెట్టి మోహన్‌ అనుచరులతో కలిసి అయ్యన్న సమక్షంలో తెదేపాలో చేరారు. నేతలు విజయ్‌, గవిరెడ్డి వెంకటరమణ, భీమవరపు రమణబాబు, బయ్యపురెడ్డి మంగతాయారు, నూకరాజు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని