logo

ప్రధాని మోదీ సభను విజయవంతం చేయాలి

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 6న సాయంత్రం నిర్వహించనున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ సభను విజయవంతం చేయాలని అనకాపల్లి పార్లమెంట్ భాజపా అభ్యర్థి సీఎం రమేశ్‌ కోరారు.

Published : 05 May 2024 03:48 IST

ప్రచారంలో దోసె వేస్తున్న కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 6న సాయంత్రం నిర్వహించనున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ సభను విజయవంతం చేయాలని అనకాపల్లి పార్లమెంట్ భాజపా అభ్యర్థి సీఎం రమేశ్‌ కోరారు. భాజాపా ఎన్నికల కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అనకాపల్లి నియోజకవర్గం కశింకోట మండలం తాళ్లపాలెం సమీపంలో 6న సాయంత్రం 4 గంటలకు మోదీ భారీ సభలో తెదేపా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పాల్గొంటారన్నారని పేర్కొన్నారు. ప్రధాని వస్తున్నారంటే అనకాపల్లి ప్రాంత అభివృద్ధి, సంక్షేమంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలకు లభిస్తాయన్నారు. మోదీ రాకతో ఈ ప్రాంతం సస్యశ్యామలంగా మారుతుందని, ఆయన సభను అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు జయప్రదం చేయాలని కోరారు. అనకాపల్లిలో అభివృద్ధి, సంక్షేమం, యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలకు కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. భాజపా, తెదేపా జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, బత్తుల తాతయ్యబాబు, నాయకులు  బుద్ధ నాగజగదీశ్వరరావు, దాడి రత్నాకర్‌, ప్రగడ నాగేశ్వరరావు, కోట్ని బాలాజీ పాల్గొన్నారు.

దోసె తిరగేస్తా..  ఓటరు మనసు గెలిచేస్తా

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: అనకాపల్లి పార్లమెంట్ కూటమి అభ్యర్థి సీఎం రమేశ్‌ శనివారం అనకాపల్లి ఉడ్‌పేటలో ప్రచారం చేశారు. ఓ హోటల్‌కి వెళ్లి అక్కడున్న వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. సరదాగా అక్కడ పెనంపైన దోసె వేశారు. కమలం గుర్తుపై ఓటు వేసి తనను, గాజు గ్లాసు గుర్తుపై ఓటువేసి ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణను గెలిపించాలని ఓటర్లను కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని