logo

ప్రధాని సభకు భారీగా జనసమీకరణ

అనకాపల్లిలో ఈనెల 6న జరగనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభకు విశాఖ నుంచి భారీగా జన సమీకరణ చేయాలని తెదేపా, భాజపా, జనసేన నాయకులు నిర్ణయించారు.

Published : 05 May 2024 04:07 IST

200 ఆర్టీసీ బస్సుల్లో తరలింపునకు కార్యాచరణ

సమావేశంలో పాల్గొన్న గండి బాబ్జీ, దామచర్ల సత్య, వంశీకష్ణ శ్రీనివాస్‌, సీతంరాజు సుధాకర్‌, వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు తదితరులు

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: అనకాపల్లిలో ఈనెల 6న జరగనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభకు విశాఖ నుంచి భారీగా జన సమీకరణ చేయాలని తెదేపా, భాజపా, జనసేన నాయకులు నిర్ణయించారు. తెదేపా జిల్లా ఇన్‌ఛార్జి దామచర్ల సత్య ఆధ్వర్యంలో శనివారం ఉదయం పార్టీ కార్యాలయంలో ముఖ్య నేతల సమావేశం జరిగింది. విశాఖ లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షులు గండి బాబ్జీ, దక్షిణ నియోజకవర్గ బాధ్యులు సీతంరాజు సుధాకర్‌, దక్షిణ నియోజకవర్గ జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్‌, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు, భాజపా జిల్లా అధ్యక్షులు మేడపాటి రవీంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

  • ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 5వేల మందికి తక్కువ కాకుండా తరలించనున్నారు. గాజువాక నుంచి కనీసం 15వేల మందిని తరలించే విధంగా ప్రణాళిక రూపకల్పన చేశారు.
  • ఆర్టీసీ నుంచి 600 బస్సులు తీసుకోవాలని అధికారులతో సంప్రదింపులు జరిపారు. నగరంలో 200 బస్సుల వరకు అందుబాటులో ఉన్నాయని, మిగిలినవి ఇతర ప్రాంతాల నుంచి రప్పిస్తామని అధికారులు చెప్పడంతో స్థానికంగా అందుబాటులో ఉన్న 200 బస్సులను తీసుకోవాలని భావిస్తున్నారు. ఇతర వాహనాల్లోనూ పార్టీ శ్రేణులను తరలించాలని నిర్ణయించారు. ప్రధాని సభను జయప్రదం చేసేందుకు అనుసరించాల్సిన పద్ధతులపై చర్చించామని గండి బాబ్జీ తెలిపారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని