logo

అదిరింది అయ్యన్నా!

ఎన్నికల ప్రచారంలో అయ్యన్నపాత్రుడు వినూత్న పంథా ఎంచుకున్నారు. ఆదివారం ఉదయాన్నే ఎన్టీఆర్‌ మినీ స్టేడియంకు వచ్చిన ఆయన వాకర్స్‌తో నడుస్తూ వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.

Published : 06 May 2024 02:56 IST

వాలీబాల్‌ ఆడుతున్న అయ్యన్న

ఎన్నికల ప్రచారంలో అయ్యన్నపాత్రుడు వినూత్న పంథా ఎంచుకున్నారు. ఆదివారం ఉదయాన్నే ఎన్టీఆర్‌ మినీ స్టేడియంకు వచ్చిన ఆయన వాకర్స్‌తో నడుస్తూ వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. వాలీబాల్‌ క్రీడాకారులతో కలిసి కొద్దిసేపు ఆడారు. బాక్సింగ్‌ క్రీడాకారుల సాధనను తిలకించారు. అక్కడ్నుంచి ఇందిరా కూరగాయల మార్కెట్‌కు చేరుకుని ఓ హోటల్‌లో టిఫిన్‌ చేసి టీ తాగారు. అనంతరం ఆర్టీసీ బస్సెక్కి మాకవరపాలెం వెళ్లారు. అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌పై వైకాపా మూకదాడిని నిరసిస్తూ కూటమి నాయకులతో కలిసి ఆందోళన చేపట్టారు. - న్యూస్‌టుడే, నర్సీపట్నం అర్బన్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని