logo

ఉచిత బస్సు ప్రయాణం: అనిత

రాష్ట్రంలో అయిదేళ్లపాటు వైకాపా చేసిన అరాచకాలకు ప్రజలంతా ఈనెల 13న ఓటుతో బుద్ధి చెప్పాలని కూటమి అభ్యర్థి వంగలపూడి అనిత అన్నారు.

Published : 06 May 2024 02:57 IST

ఎన్‌.నర్సాపురంలో ఓట్లు అభ్యర్థిస్తున్న అనిత

నక్కపల్లి, న్యూస్‌టుడే: రాష్ట్రంలో అయిదేళ్లపాటు వైకాపా చేసిన అరాచకాలకు ప్రజలంతా ఈనెల 13న ఓటుతో బుద్ధి చెప్పాలని కూటమి అభ్యర్థి వంగలపూడి అనిత అన్నారు. మండలంలోని ఎన్‌.నర్సాపురంలో ఆదివారం ఆమె ప్రచారం చేపట్టారు. స్థానిక నాయకులు కోలాటాలు, తప్పెటగుళ్లతో స్వాగతం పలకగా, మహిళలు హారతులు పట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి అధికారంలోకి రాగా ఏప్రిల్‌ నెలనుంచే రూ. 4 వేలు పింఛన్‌ ఇంటింటికీ అందజేస్తారని వివరించారు. మహిళలకు ఉచిత బస్‌ ప్రయాణం, ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితమని వివరించారు. రైతులకు రూ. 20వేలు, విద్యార్థులకు రూ. 15వేల చొప్పున ఇస్తారని పేర్కొన్నారు. అసెంబ్లీ అభ్యర్థికి సైకిల్‌, ఎంపీ అభ్యర్థికి కమలం గుర్తుపై ఓటేయాలని విన్నవించారు. కార్యక్రమంలో కొప్పిశెట్టి వెంకటేష్‌, కురందాసు నూకరాజు, కొప్పిశెట్టి బుజ్జి, గట్టెం గణేష్‌, మనబాల గంగరాజు, వెలగా సుధాకర్‌, కోసూరు శ్రీను, వంగలపూడి శ్రీను, మనబాల కొండబాబు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని