logo

కూటమి ప్రభుత్వంలో ఏడాదికి 3 సిలిండర్లు ఉచితం

తెదేపా, జనసేన, భాజపా కూటమి అధికారంలోకి వచ్చిన తక్షణం మహిళలకు సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వనున్నట్లు కూటమి(జనసేన) దక్షిణం అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్‌ పేర్కొన్నారు.

Published : 06 May 2024 03:08 IST

మహిళలకు కండువాలు వేసి ఆహ్వానిస్తున్న వంశీకృష్ణ శ్రీనివాస్‌

అల్లిపురం, న్యూస్‌టుడే: తెదేపా, జనసేన, భాజపా కూటమి అధికారంలోకి వచ్చిన తక్షణం మహిళలకు సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వనున్నట్లు కూటమి(జనసేన) దక్షిణం అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్‌ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన 34వ వార్డు కొబ్బరితోటలో పర్యటించారు. వంశీకృష్ణ శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలకు 50 ఏళ్లకే పింఛను మంజూరు చేస్తామన్నారు. పోర్టు కాలుష్యం కారణంగా ప్రజలు శ్వాసకోశ, చర్మ వ్యాధుల బారిన పడుతున్నారన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తానని చెప్పారు. 34వ వార్డు పరిధిలో ఉన్న దోబీ ఘాట్లను ఆధునికీకరిస్తామని హామీ ఇచ్చారు. తనకు గాజు గ్లాసు గుర్తుపై, కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్‌కు సైకిల్‌ గుర్తుపై ఓటు వేసి అఖండ విజయం చేకూర్చాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు జనసేన పార్టీలో చేరగా, వారికి వంశీకృష్ణ శ్రీనివాస్‌ కండువాలు వేసి ఆహ్వానించారు. వార్డు తెదేపా అధ్యక్షుడు వాసుపల్లి రామ్‌కుమార్‌, నాయకులు రాజేశ్వరరావు, నాగల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని