logo

ఏప్రిల్‌లో భారీ రికవరీ

విశాఖ కమిషనరేట్‌ పరిధిలో ఏప్రిల్‌ నెలలో 68 ఆస్తి చోరీ కేసులు నమోదు కాగా, వాటిలో 49 కేసులను ఛేదించినట్లు జె.సి.పి. ఫకీరప్ప, డి.సి.పి. వెంకటరత్నంలు వెల్లడించారు.

Published : 06 May 2024 03:12 IST

49 కేసుల్లో రూ.37.63 లక్షల చోరీ సొత్తు స్వాధీనం

స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలు, ఫోన్లు

ఎం.వి.పి.కాలనీ, న్యూస్‌టుడే : విశాఖ కమిషనరేట్‌ పరిధిలో ఏప్రిల్‌ నెలలో 68 ఆస్తి చోరీ కేసులు నమోదు కాగా, వాటిలో 49 కేసులను ఛేదించినట్లు జె.సి.పి. ఫకీరప్ప, డి.సి.పి. వెంకటరత్నంలు వెల్లడించారు. ఏప్రిల్‌ నెలకు సంబంధించిన రికవరీ వివరాలు ఆదివారం పోలీసు సమావేశమందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలిపారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

  • ఏప్రిల్‌ నెలలో కేంద్ర కారాగారం నుంచి 39 మంది ఆస్తి దొంగతనాల కేసుల్లోని నిందితులు విడుదలయ్యారు. వారిపై ప్రత్యేక దృష్టి సారించాం.
  • ఏప్రిల్‌ నెలలో 49 కేసుల్లో 65 మంది నిందితులను అరెస్టు చేశాం. 969.05 గ్రాముల బంగారు ఆభరణాలు, 181 గ్రాముల వెండి వస్తువులు, రూ.7.63 లక్షల నగదు, ఒక కారు, ద్విచక్రవాహనం, ఆటో, 14 ఫోన్లు స్వాధీనం చేసుకున్నాం.
  • చాట్బాట్ నెంబరుకు పోగొట్టుకున్న ఫోన్ల కోసం ఫిర్యాదులు  రాగా, ఏప్రిల్‌ నెలలో రూ.52లక్షల విలువ చేసే 351 ఫోన్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నాం. ఇప్పటి వరకు నగర పరిధిలో పోగొట్టుకున్న ఫోన్లలో 2208 వరకు స్వాధీనం చేసుకుని, ఆయా లబ్ధిదారులకు అందజేస్తున్నాం. గతంలో మాదిరిగా కోర్టు ద్వారా కాకుండా పోగొట్టుకున్న సొత్తుకు ఆధారాలు ఉంటే బాధితులకు అందజేస్తున్నామన్నారు. అనంతరం బాధితులకు వారి సొత్తును అందజేశారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని