logo

అయిదేళ్లలో కాపులకు రూ.15వేల కోట్లు ఖర్చు చేస్తాం

కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక కాపులకు ప్రత్యేకంగా రూ.15 వేల కోట్లు ఖర్చు చేసి కాపుల సాధికారత, అభివృద్ధికి తగిన చర్యలు తీసుకుంటామని తెదేపా నేత వంగవీటి రాధా ప్రకటించారు.

Published : 06 May 2024 03:13 IST

విశాఖ పశ్చిమంలో వంగవీటి రాధా ప్రచారం

మాట్లాడుతున్న తెదేపా నేత వంగవీటి రాధా, పక్కన ఎమ్మెల్యే గణబాబు

సింధియా, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక కాపులకు ప్రత్యేకంగా రూ.15 వేల కోట్లు ఖర్చు చేసి కాపుల సాధికారత, అభివృద్ధికి తగిన చర్యలు తీసుకుంటామని తెదేపా నేత వంగవీటి రాధా ప్రకటించారు. ఆదివారం రాత్రి విశాఖ పశ్చిమం పరిధి శ్రీహరిపురంలో తెదేపా, భాజపా, జనసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాపుల ఆత్మీయ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అయిదేళ్ల వైకాపా పాలనలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాధనాన్ని దోచుకుని, రాజధాని అమరావతిని సర్వనాశనం చేశారన్నారు. అలా దోచుకున్న సొమ్ములోంచి ఓటుకు రూ.5 వేలు ఇచ్చినా తీసుకుని, ఓటు మాత్రం కూటమి అభ్యర్థులైన గణబాబు, శ్రీభరత్‌కే వేయాలన్నారు. పశ్చిమ ఎమ్మెల్యే పి.గణబాబు మాట్లాడుతూ... వైకాపా పాలనలో దోపిడీ తప్ప, ఎక్కడా అభివృద్ధి జరగలేదన్నారు. చంద్రబాబునాయుడు మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతుందన్నారు. ఏడు వార్డుల కూటమి సమన్వయకర్త విశ్వనాథుల దినకర్‌, కాపు సంఘ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని