logo

భోగాపురం ఎయిర్‌పోర్టుకు ‘అల్లూరి’ పేరు : శ్రీభరత్‌

కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత భోగాపురం ఎయిర్‌పోర్టుకు ‘అల్లూరి’ పేరు పెడతామని విశాఖ తెదేపా ఎంపీ అభ్యర్థి శ్రీభరత్‌, గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు అన్నారు.

Published : 06 May 2024 03:16 IST

కూటమి తెదేపా ఎంపీ అభ్యర్థి శ్రీభరత్‌, ఎమ్మెల్యే అభ్యర్థి పల్లాను సత్కరిస్తున్న సభ్యులు

కూర్మన్నపాలెం, న్యూస్‌టుడే : కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత భోగాపురం ఎయిర్‌పోర్టుకు ‘అల్లూరి’ పేరు పెడతామని విశాఖ తెదేపా ఎంపీ అభ్యర్థి శ్రీభరత్‌, గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం ఆటోనగర్‌ గ్రీన్‌సిటీ కల్యాణ మండపంలో నిర్వహించిన క్షత్రియుల ఆత్మీయ సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అప్పుల ఊబిలోకి నెట్టేసిన వైకాపాను ఇంటికి సాగనంపి, తెదేపా అభ్యర్థులను గెలిపించేలా సైకిల్‌ గుర్తుపై ఓటేయాలని కోరారు. అనంతరం క్షత్రియ సంఘం ప్రతినిధులంతా కలిసి శ్రీభరత్‌, పల్లాను సత్కరించారు. సభ్యులు బి.రాజన్‌రాజు, విజయరామరాజు, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని