logo

కోడ్‌.. ఏమైంది?

ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నా  అధికార వైకాపా నాయకులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు.

Published : 06 May 2024 03:35 IST

16వ వార్డు ఇసుకతోటలో స్టిక్కర్లు అతికిస్తూ టోకెన్లు, ఓటరు స్లిప్పులు అందజేస్తున్న వైకాపా నాయకులు

ఎం.వి.పి.కాలనీ, న్యూస్‌టుడే : ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నా  అధికార వైకాపా నాయకులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. 16వ వార్డు ఇసుకతోట శివాలయం వీధిలో వైకాపాకు చెందిన నాయకులు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను తెలుసుకుంటూ, ఆయా ఓటర్లకు అనుగుణంగా టోకెన్లు అందజేస్తున్నారు. తర్వాత ఇంటిపై సిద్ధం పేరిట ఉన్న స్టిక్కర్లను అతికిస్తున్నారు. ఇలా బహిరంగంగానే ఇంటింటికి స్టిక్కర్లను అతికిస్తున్నా, పార్టీరంగులు, నాయకుల చిత్రాలతో కూడిన టోకెన్లు జారీ చేస్తున్నా.. ఎన్నికల అధికారులు మాత్రం తమకేమీ సమాచారం లేదని చెబుతుండటం విశేషం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని