logo

సేవలకు గుర్తింపు

సమష్టి కృషితో ఏదైనా సాధించొచ్చని రుజువుచేశారు రస్తాకుంటుబాయి కృషి విజ్ఞానకేంద్రం శాస్త్రవేత్తలు. జిల్లాలోని గిరిజన ప్రాంత రైతులకే కాకుండా గిరిజనేతరులకు కూడా పంటలపై అవగాహన కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. 1984లో స్థాపించిన ఈ కేంద్రం

Published : 20 Jan 2022 05:10 IST

ఉత్తమ కృషి విజ్ఞాన కేంద్రంగా రస్తాకుంటుబాయి

కురుపాం, గుమ్మలక్ష్మిపురం, న్యూస్‌టుడే: సమష్టి కృషితో ఏదైనా సాధించొచ్చని రుజువుచేశారు రస్తాకుంటుబాయి కృషి విజ్ఞానకేంద్రం శాస్త్రవేత్తలు. జిల్లాలోని గిరిజన ప్రాంత రైతులకే కాకుండా గిరిజనేతరులకు కూడా పంటలపై అవగాహన కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. 1984లో స్థాపించిన ఈ కేంద్రం రాష్ట్రంలోని 13 కృషి విజ్ఞాన కేంద్రాల్లో ఉత్తమ కేవీకేగా ఈ ఏడాది గుర్తింపు పొంది పురస్కారానికి ఎంపికైంది.

సేవలిలా...: గిరిజనులు సాగు చేస్తున్న జీడి, మామిడి తోటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు ఎరువులు వాడే విధానాన్ని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. వరిసాగులో కొత్త పద్ధతులు, కొత్త వంగడాలను నాటడం వల్ల కలిగే లాభాలతో పాటు పెరటితోటల పెంపకంవల్ల వచ్చే లాభాలపై అవగాహన కల్పిస్తున్నారు. బ్యాకరీ ఉత్పత్తులు, నర్సరీల ఏర్పాటు వల్ల ఆదాయాన్ని మెరుగుపరిచే విధానాలపై మహిళలకు శిక్షణ ఇస్తున్నారు. కొత్తవంగడాలపై ప్రదర్శన క్షేత్రాలు, రైతులను సమన్వయపరుస్తూ వాట్సాప్‌ గ్రూపులో సాగుపై సలహాలు.. సూచనలు అందించడం, వాతావరణ సమాచారాన్ని ముందుగా తెలియపరిచే సేవల వల్ల పురస్కారానికి ఎంపికైంది.

ఆనందదాయకం

కృషి విజ్ఞాన కేంద్రానికి రాష్ట్రస్థాయిలో గుర్తింపు రావడం ఆనందదాయకం. ఈనెల 21న ఏయూలో పురస్కార ప్రదానోత్సవం జరగనుంది. మా బాధ్యత మరింత పెరిగిందని భావిస్తున్నాం. - మురళీకృష్ణ, సమన్వయకర్త, కేవీకే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని