logo

సమాచారం ఇస్తే రూ.లక్ష రివార్డు

జిల్లాలో ఎక్కడైనా అనధికారికంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు ఆధారాలు అందజేస్తే సంబంధిత వ్యక్తులకు రూ.లక్ష రివార్డు అందజేయనున్నట్లు డీఎంహెచ్‌వో రమణకుమారి ప్రకటించారు. శుక్రవారం ఆమె తన కార్యాలయంలో లింగ నిర్ధారణ చట్టం అమలుతీరుపై సంబంధిత విభాగాల

Published : 22 Jan 2022 05:45 IST


సూచనలు చేస్తున్న డీఎంహెచ్‌వో రమణకుమారి

వైద్య విభాగం, న్యూస్‌టుడే: జిల్లాలో ఎక్కడైనా అనధికారికంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు ఆధారాలు అందజేస్తే సంబంధిత వ్యక్తులకు రూ.లక్ష రివార్డు అందజేయనున్నట్లు డీఎంహెచ్‌వో రమణకుమారి ప్రకటించారు. శుక్రవారం ఆమె తన కార్యాలయంలో లింగ నిర్ధారణ చట్టం అమలుతీరుపై సంబంధిత విభాగాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. అనుమతులు లేకుండా ఎవరైనా కేంద్రాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రోగ్రామ్‌ అధికారులు, కమిటీ సభ్యులు నెలలో 10 స్కానింగ్‌ కేంద్రాలను తనిఖీ చేసి నివేదికలను సమర్పించాలన్నారు. అదనపు డీఎంహెచ్‌వో రామమోహన్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని