logo

ప్రత్యేక అంబులెన్స్‌ ప్రారంభం

జిల్లా ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని అన్ని సదుపాయాలతో కూడిన అడ్వాన్స్‌డ్‌ లైఫ్‌ సేఫ్టీ సపోర్టు అంబులెన్స్‌ను పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా సమకూర్చింది. రూ.30 లక్షల సీఎస్‌ఆర్‌ నిధులతో జిల్లాకు కేటాయించిన దీన్ని కలెక్టర్‌ ఎ.సూర్యకుమారి

Updated : 27 May 2022 05:34 IST

తాళం చెవి అందిస్తున్న కలెక్టర్‌ సూర్యకుమారి

కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: జిల్లా ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని అన్ని సదుపాయాలతో కూడిన అడ్వాన్స్‌డ్‌ లైఫ్‌ సేఫ్టీ సపోర్టు అంబులెన్స్‌ను పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా సమకూర్చింది. రూ.30 లక్షల సీఎస్‌ఆర్‌ నిధులతో జిల్లాకు కేటాయించిన దీన్ని కలెక్టర్‌ ఎ.సూర్యకుమారి పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ సౌత్‌ రీజియన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అనూప్‌ కుమార్‌తో కలసి గురువారం కలెక్టరేట్‌ ఎదుట ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ జిల్లాలో రిఫరల్‌ కేసులు ఎక్కువగా ఉండే ఎస్‌.కోట, ఎల్‌.కోట, కొత్తవలస పరిధిలోని ప్రాంతాల ప్రజలకు అంబులెన్స్‌ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని రెడ్‌క్రాస్‌ సొసైటీ ప్రతినిధులకు సూచించారు. ప్రత్యేక ఉపకలెక్టర్‌ పద్మావతి, రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లా ఛైర్మన్‌ కేఆర్‌డీ ప్రసాదరావు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని