logo

శ్రీభద్రకాళికి పవిత్ర ధారణం

వరంగల్‌లోని శ్రీభద్రకాళి దేవాలయంలో మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు వైభవంగా జరిగాయి. చివరిరోజు శుక్రవారం శ్రావణ పౌర్ణమి పర్వదినం సందర్భంగా భద్రకాళి అమ్మవారికి వివిధ రంగులతో తయారు చేసిన పవిత్రాలను అలంకరించారు.  భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Updated : 13 Aug 2022 05:14 IST

కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుంటున్న చీఫ్‌విప్‌ వినయ్‌భాస్కర్‌

రంగంపేట, న్యూస్‌టుడే: వరంగల్‌లోని శ్రీభద్రకాళి దేవాలయంలో మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు వైభవంగా జరిగాయి. చివరిరోజు శుక్రవారం శ్రావణ పౌర్ణమి పర్వదినం సందర్భంగా భద్రకాళి అమ్మవారికి వివిధ రంగులతో తయారు చేసిన పవిత్రాలను అలంకరించారు.  భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఏడాదంతా నిర్వహించాల్సిన పూజారాధనల్లో  అర్చకులు, భక్తులు, అధికారుల వల్ల తెలిసీˆ తెలియక జరిగిన అపచారాలతో సక్రమించే పాపాలు తొలగిపోయి శుద్ధ సంపాదనంతో పాటు లోక కల్యాణం కోసం ఈ పవిత్రోత్సవాన్ని నిర్వహిస్తారని ప్రధానార్చకుడు శేషు తెలిపారు. వేలాది మంది భక్తులకు పురోహితులు రక్షా బంధనం చేశారు. శ్రావణమాసం మూడో శుక్రవారం, రాఖీ పౌర్ణమి కావడంతో ఆలయం భక్తులతో కిట కిటలాడింది. ఎంజీఎం కూడలిలోని శ్రీరాజరాజేశ్వరాలయం, హంటర్‌రోడ్‌లోని సంతోషిమాత, హనుమకొండలోని పద్మాక్షమ్మలకు మహిళలు ఒడి బియ్యం సమర్పించారు. వాయినాలు ఇచ్చి పుచ్చుకున్నారు. చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి ఆభరణాల నిమిత్తం రూ.33వేల విరాళం అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని