logo

రెండు పడక గదుల ఇళ్లు అమ్మితే చర్యలు

లబ్ధిదారులకు కేటాయించిన రెండు పడక గదుల ఇళ్లను ఎవరైనా అమ్మితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా తెలిపారు.

Published : 26 Apr 2024 04:35 IST

లబ్ధిదారుల సమస్యలను తెలుసుకుంటున్న జిల్లా కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా

భూపాలపల్లి : లబ్ధిదారులకు కేటాయించిన రెండు పడక గదుల ఇళ్లను ఎవరైనా అమ్మితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా తెలిపారు. నీటి ఎద్దడి నివారణ చర్యల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని వేశాలపల్లి ప్రాంతంలోని రెండు పడక గదుల ఇళ్లను గురువారం మున్సిపాలిటీ, పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ అధికారులతో కలిసి కలెక్టర్‌ పరిశీలించారు. సంపులో నీటి సామర్థ్యం గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిరుపేదలను గుర్తించి రెండు పడక గదుల ఇళ్లు కేటాయించామన్నారు. ఇళ్లు అమ్ముకోవడం సరికాదని కలెక్టర్‌ సూచించారు. కాలనీలో ఏర్పాటు చేసుకున్న అభివృద్ధి కమిటీ సభ్యులు ఎవరైనా ఇళ్లు అమ్ముకున్నా, ఇతరులకు అద్దెకు ఇచ్చినా మున్సిపాలిటీ అధికారులకు తెలియపర్చాలని సూచించారు. కాలనీలో డ్రైనేజీ కాల్వలతో పాటు చుట్టూ ప్రహరీ నిర్మించాలని, కాలనీవాసులకు సరిపడా విద్యుత్తు సౌకర్యాన్ని కల్పించాలని లబ్ధిదారులు కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో పీఆర్‌డీఈ వెంకటేశ్వర్లు, మున్సిపల్‌ కమిషనర్‌ రాజేశ్వర్‌, ఏఈ రోజా పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు