logo

అటవీశాఖ ప్రత్యేక గస్తీ

మండలంలోని నగరం, బాలాజీతండా, కోట్యానాయక్‌తండా, పోచారం పరిసరాల్లో ఉన్న బెరైటీస్‌ ఖనిజాల పరిరక్షణకు అటవీశాఖాధికారులు ప్రత్యేక గస్తీని ఏర్పాటు చేశారు. 

Published : 26 Apr 2024 04:33 IST

బెరైటీస్‌ ప్రాంతాల్లో విధుల్లో ఉన్న అటవీశాఖ సిబ్బంది

గార్ల, న్యూస్‌టుడే: మండలంలోని నగరం, బాలాజీతండా, కోట్యానాయక్‌తండా, పోచారం పరిసరాల్లో ఉన్న బెరైటీస్‌ ఖనిజాల పరిరక్షణకు అటవీశాఖాధికారులు ప్రత్యేక గస్తీని ఏర్పాటు చేశారు.  ఈనెల 24వ తేదీన ‘ఈనాడు’లో ‘రాత్రి వేళల్లో తరలిస్తున్నారు..!’ శీర్షికన ప్రచురితమైన కథనానికి అటవీశాఖాధికారులు స్పందించారు. అటవీక్షేత్రాధికారి సువర్చలారెడ్డి ఆదేశాల మేరకు ఉప క్షేత్రాధికారి రమేష్‌ ఆధ్వర్యంలో సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఇద్దరు వాచర్లు, బీట్‌ ఆఫీసర్‌ బెరైటీస్‌ ఖనిజాల పరిసరాల్లో విధుల నిర్వహణలను ప్రారంభించారు. మొత్తం ముప్పై మంది సిబ్బంది రొటేషన్‌ పద్ధతిలో బెరైటీస్‌, అటవీ పరిసరాల్లో విధులను నిర్వహిస్తున్నట్లు డీఆర్‌వో తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని