logo

పారదర్శకంగా ఓటరు జాబితా రూపకల్పన

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కును కల్పిస్తూ పారదర్శకంగా ఓటరు జాబితాను రూపొందించాలని కేంద్ర అదనపు ఎన్నికల కమిషనర్‌ నీతీశ్‌వ్యాస్‌ అధికారులను ఆదేశించారు.

Published : 03 Dec 2022 04:46 IST

వీడియోకాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా

భూపాలపల్లి కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కును కల్పిస్తూ పారదర్శకంగా ఓటరు జాబితాను రూపొందించాలని కేంద్ర అదనపు ఎన్నికల కమిషనర్‌ నీతీశ్‌వ్యాస్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఓటరు జాబితాపై జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి మాట్లాడారు. మరణించిన వారు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి పేర్లను ఒకటికి రెండు సార్లు సరిచూసుకుని క్షేత్రస్థాయి విచారణ తర్వాత తొలగించాలన్నారు. ప్రతి వారం నూతన ఓటర్ల నమోదు, ఓటర్ల వివరాలను అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందించడంతో పాటు ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. జిల్లా కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా మాట్లాడుతూ.. జిల్లాలో పక్కాగా ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నామని, అర్హులైన నూతన ఓటర్లు 16 వేల మంది ఉంటారని అంచనా వేశామని, ఇప్పటి వరకు వెయ్యి మందికి పైగా ఓటుహక్కు కల్పించామన్నారు. కార్యక్రమంలో డీటీ అబ్బాస్‌, నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.

నేడు, రేపు ప్రత్యేక నమోదు

డిసెంబర్‌ 3, 4 తేదీల్లో జిల్లాలోని అన్ని పోలింగ్‌ కేంద్రాల పరిధిలో నూతన ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, యువజన, స్వచ్ఛంద సంస్థలు, స్వయం సహాయక సంఘాల ప్రతినిధులు ఓటరు నమోదు చేసుకొని వారిని గుర్తించి నూతనంగా నమోదు చేసుకునేలా సహకరించాలన్నారు. ఓటరు నమోదు, అభ్యంతరాలను డిసెంబర్‌ 26వ తేదీ వరకు పరిశీలన చేసి 2023 జనవరి 5న తుది ఓటరు జాబితా ప్రకటన చేస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని