logo

ఆలయ స్థలంలో వెలిసిన జెండాలు

శ్రీభద్రకాళి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ సీతారామచంద్రస్వామి దేవుడి పేరుతో హనుమకొండ పెద్దమ్మగడ్డ శివారులో ఉన్న స్థలంలో రెండు రోజులుగా ఎర్ర జెండాలు, తాత్కాలిక గుడారాలు వెలిశాయి.

Updated : 06 Feb 2023 05:20 IST

రంగంపేట, న్యూస్‌టుడే: శ్రీభద్రకాళి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ సీతారామచంద్రస్వామి దేవుడి పేరుతో హనుమకొండ పెద్దమ్మగడ్డ శివారులో ఉన్న స్థలంలో రెండు రోజులుగా ఎర్ర జెండాలు, తాత్కాలిక గుడారాలు వెలిశాయి. హనుమకొండ మండలం పెద్దమ్మగడ్డలోని కేఎస్సార్‌ గార్డెన్‌ వెనకాల సర్వే నంబరు 479లో శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం పేరుతో 3 ఎకరాల భూమి ఉంది. రెండు, మూడు రోజులుగా కొందరు ప్రైవేటు వ్యక్తులు జెండాలు పాతారని తెలియడంతో ఆదివారం భద్రకాళి దేవస్థానం కార్యనిర్వహణాధికారిణి శేషుభారతి ఆధ్వర్యంలో ఉద్యోగులు పరిశీలించారు. దేవాలయానికి చెందిన భూమిలో ఎవరైనా ఆక్రమణకు ప్రయత్నిస్తే హిందూ దేవాదాయ ధర్మాదాయ శాఖ చట్టం 30/87 ప్రకారం శిక్షార్హులవుతారని ఈవో ఒక ప్రకటనలో తెలిపారు. పాతిన జెండాలు వెంటనే తొలగించాలని లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని