logo

శంకుస్థాపనలు.. ప్రారంభోత్సవాలు

‘మండుటెండను లెక్క చేయకుండా అలుపు, సొలుపు లేకుండా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ వరంగల్‌ జిల్లాలో విస్తృతంగా పర్యటించారు.

Updated : 18 Jun 2023 05:23 IST

ఉదయం నుంచి రాత్రి వరకు మంత్రి కేటీఆర్‌ సుడిగాలి పర్యటన

న్యూస్‌టుడే, కార్పొరేషన్‌, వరంగల్‌ కలెక్టరేట్‌, శివనగర్‌, రంగశాయిపేట, పోచమ్మమైదాన్‌, ములుగురోడ్డు, : ‘మండుటెండను లెక్క చేయకుండా అలుపు, సొలుపు లేకుండా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ వరంగల్‌ జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. శనివారం ఉదయం 10 నుంచి రాత్రి 8.20 గంటల వరకు మంత్రి కేటీఆర్‌ సుడిగాలి పర్యటన సాగింది. మొత్తం 16 అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సుమారు రూ.1745 కోట్లతో వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. గీసుకొండ మండలం శాయంపేట కాకతీయ మెగా వస్త్ర నగరి నుంచి వరంగల్‌ అజంజాహి మిల్లు మైదానంలో నిర్వహించిన భారాస బహిరంగ సభ వరకు మంత్రి కేటీఆర్‌ పర్యటన సాగింది. వరంగల్‌ తూర్పు నియోజకవర్గం గులాబీమయమైంది. అడుగడుగునా స్వాగత తోరణాలు, ఫ్లెక్సీలు, జెండాలు దర్శనమిచ్చాయి.

నిర్వాసితులకు పట్టాలు

తూర్పు నియోజకవర్గంలో ఇప్పటికే రూ.3,800 కోట్ల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, శనివారం ఒకేరోజు రూ.618కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగాయని ఎమ్మెల్యే నరేందర్‌ వెల్లడించారు. బహిరంగ సభలో నరేందర్‌ మాట్లాడుతూ 43 మురికివాడల్లోని భూనిర్వాసితులకు పట్టాలు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లకే దక్కుతుందన్నారు. లేబర్‌కాలనీ ప్రాంతంలో 90శాతం పేదప్రజలు నివసిస్తారనని, అలాంటి చోట నూతన కలెక్టరేట్‌ నిర్మాణంతో వారికి ఉపాధి అవకాశాలతో పాటు భూముల ధరలు రెట్టింపవుతాయన్నారు.

మంత్రి  పర్యటన ఇలా సాగింది..

ఉదయం 10.15: హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో నేరుగా కాకతీయ మెగా వస్త్ర నగరి వద్దకు మంత్రి కేటీఆర్‌ రాక.

10.49: యంగ్‌ వన్‌ కంపెనీకి శిలాఫలకం, భూమి పూజ.

11.55: రోడ్డు మార్గంలో వరంగల్‌కు బయలు దేరారు.

మధ్యాహ్నం  12.52:  వరంగల్‌ ఓసిటీలోని తూర్పు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం భవనం వద్దకు చేరిక.

1.10: వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రారంభం. సుమారు గంటన్నర పాటు మంత్రి కేటీఆర్‌ ఇక్కడే ఉండి ప్రజాప్రతినిధులతో కలిసి భోజనం చేశారు.

2.30: అజంజాహి మిల్లు మైదానంలో వరంగల్‌ జిల్లా నూతన సమీకృత కలెక్టరేటు భవన నిర్మాణానికి శంకుస్థాపన.

2.56: జర్నలిస్టులకు నిర్మించిన రెండు పడకల ఇళ్ల ప్రారంభం. ఇక్కడే ఐడీసీˆ వసతి గృహానికి శంకుస్థాపన.  

3.20: కొత్తవాడ గోపాలస్వామి గుడిలో దివంగత ఆచార్య కొండా లక్ష్మణ్‌బాపూజీ, చేనేత కార్మికుల విగ్రహావిష్కరణ

సాయంత్రం 4.00  బల్దియా ప్రధాన కార్యాలయంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల పైలాన్‌ ఆవిష్కరణ

4.15: మండిబజారు ఈద్గా, దర్గా అభివృద్ధి పనులకు శంకుస్థాపన

4.25: వరంగల్‌  చౌరస్తా కూడలిలో స్మార్ట్‌ రోడ్లు ప్రారంభం.

4.35: వరంగల్‌ బస్టాండ్‌ ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన

4.55: ఖమ్మంరోడ్‌ రోటరీ క్లబ్‌ ముందు వరంగల్‌ తూర్పు సోషల్‌ మీడియా కార్యాలయం ప్రారంభం.

5.10: రంగశాయిపేట నాయుడు పంపు కూడలిలో ఇన్నర్‌ రింగురోడ్డు పనులకు శంకుస్థాపన

5.15: ఉర్సు రంగసముద్రం వద్ద మురుగునీటి శుద్ధీకరణ కేంద్రం ప్రారంభోత్సవం, ఉర్సుగుట్ట రంగలీల మైదానంలో ఉర్సు చెరువు సుందరీకరణ, కల్చరల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌, తాగునీటి పైపులైన్లు, పట్టణ ప్రగతి అభివృద్ధి పనులకు శంకుస్థాపన

5.35: ఉర్సు దర్గాలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, దర్గాలో ప్రార్థనలు

6.05: రంగశాయిపేటలో ‘కుడా’ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

6.30: ఫసాడ్‌ లైటింగ్‌ ప్రారంభోత్సవం. అనంతరం గంటపాటు ఖిలావరంగల్‌ కోటలో రాతి, మట్టి కోట విశేషాలు, ఇతర అభివృద్ధి పనులు తెెలుసుకొని టీ, స్నాక్స్‌ తీసుకున్నారు.

రాత్రి  7.30:  వరంగల్‌ అజంజాహి మిల్లు మైదానంలో జరిగిన భారాస బహిరంగ సభ వేదికకు చేరిక.

8.20 వరకు సమావేశంలో పాల్గొన్నారు.

8.30: రోడ్డు మార్గంలో హైదరాబాద్‌ పయనం.

 కాకతీయ మెగా వస్త్రపరిశ్రమలో యంగ్‌వన్‌ సంస్థ యూనిట్‌కు శంకుస్థాపన చేసిన అనంతరం సంస్థ ఛైర్మన్‌ కిహాక్‌సంగ్‌కు ఒప్పంద పత్రాలను అందజేస్తున్న   మంత్రి కేటీఆర్‌, పక్కన పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌రంజన్‌, ఎండీ నరసింహారెడ్డి, తదితరులు

జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయానికి భూమిపూజ చేస్తున్న మంత్రి కేటీఆర్‌, పాలనాధికారి ప్రావీణ్య, ఎమ్మెల్యే నరేందర్‌ తదితరులు

దేశాయిపేటలో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లను ప్రారంభిస్తూ..

కొత్తవాడలో కొండా లక్ష్మణ్‌ బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ..

సభకు హాజరైన జనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు