logo

ఓటరు చైతన్యానికి ‘గైడ్‌’

ఓటర్లందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా అధికార యంత్రాంగం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా వివిధ రూపాల్లో ఓటరు చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

Published : 16 Apr 2024 05:03 IST

గోపాలపూర్‌, న్యూస్‌టుడే: ఓటర్లందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా అధికార యంత్రాంగం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా వివిధ రూపాల్లో ఓటరు చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ సారి లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ శాతం గణనీయంగా పెంచేందుకు ‘ఓటరు గైడ్‌’ తీసుకొచ్చింది. ఓటరు నమోదు నుంచి ఓటు హక్కు వినియోగించుకునే వరకు సమగ్ర వివరాలతో కూడిన బుక్‌లెట్‌తో విస్తృత ప్రచారం కల్పిస్తోంది. హనుమకొండ, వరంగల్‌, జయశంకర్‌, మహబాబూబాద్‌, జనగామ, ములుగు జిల్లాల్లో స్వీప్‌ బృందాలు ఓటర్లకు ఈ పుస్తకాలు అందిస్తూ ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటేయాలని అవగాహన, చైతన్యం కల్పిస్తున్నాయి.

10 పేజీల బుక్‌లెట్‌: కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించిన బుక్‌లెట్‌లు ఇప్పటికే ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చేరుకున్నాయి. ప్రతి బూత్‌ స్థాయి అధికారి(బీఎల్‌ఓ) దగ్గర అందుబాటులో ఉన్నాయి. ఇంటింటికీ బీఎల్‌వోలు వెళ్లి ఈ పుస్తకం అందించి అవగాహన కల్పిస్తున్నారు. ప్రధానంగా తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్న యువత కోసం కళాశాలలకు వెళ్లి ఓటరు చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఓటుహక్కు వినియోగం, పోలింగ్‌ ప్రక్రియకు సంబంధించిన వివరాలతోపాటు ఎన్నికల సంఘం రూపొందించిన వివిధ యాప్‌లు, పనితీరు, ఓటరు ప్రతిజ్ఞ తదితర అంశాలను పది పేజీల బుక్‌లెట్‌ వివరిస్తుంది. ‘చైతన్యవంతమైన ప్రజాస్వామ్యం కోసం ఓటు అప్రమత్తత- పరిశీలన నిజాయతీ గల ఓటరు’ అనే నినాదాలతో ఈ పుస్తకాన్ని ముద్రించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని