logo

భారాస అభ్యర్థి నామపత్రం దాఖలు

మహబూబాబాద్‌ లోక్‌సభ భారాస అభ్యర్థి మాలోత్‌ కవిత మంగళవారం ఆ పార్టీ నేతలతో కలిసి నామినేషన్‌ వేశారు. ముందుగా కురవి వీరభద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

Published : 24 Apr 2024 02:40 IST

నామపత్రం అందించేందుకు వెళుతున్న భారాస అభ్యర్థి మాలోత్‌ కవిత, ఎమ్మెల్సీలు సత్యవతిరాథోడ్‌, తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు రేగ కాంతారావు, పెద్ది సుదర్శన్‌రెడ్డి, హరిప్రియ, డీఎస్‌.రెడ్యానాయక్‌, ములుగు తాత్కాలిక జడ్పీ ఛైర్‌పర్సన్‌ బడే నాగజ్యోతి, ఆంగోతు బిందు

మహబూబాబాద్‌, న్యూస్‌టుడే: మహబూబాబాద్‌ లోక్‌సభ భారాస అభ్యర్థి మాలోత్‌ కవిత మంగళవారం ఆ పార్టీ నేతలతో కలిసి నామినేషన్‌ వేశారు. ముందుగా కురవి వీరభద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తన క్యాంపు కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే డీఎస్‌. రెడ్యానాయక్‌-లక్ష్మీ దంపతులు నామినేషన్‌ వేసేందుకు వెళుతున్న తమ కూతురు కవితను ఆశీర్వదించారు. తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించి కుటుంబసభ్యులతోపాటు ముఖ్యనాయకులతో ఆమె ప్రదర్శనగా వెళ్లారు. ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ, మాజీ మంత్రి సత్యవతిరాథోడ్‌, ములుగు జడ్పీ అధ్యక్షురాలు బడే నాగజ్యోతితో కలిసివెళ్లి రిటర్నింగ్‌ అధికారి అద్వైత్‌కుమార్‌సింగ్‌కు నామపత్రాలను అందజేశారు. మహబూబాబాద్‌, డోర్నకల్‌, ఇల్లందు, పినపాక, నర్సంపేట మాజీ ఎమ్మెల్యేలు బానోత్‌ శంకర్‌నాయక్‌, డీఎస్‌.రెడ్యానాయక్‌, హరిప్రియ, పెద్ది సుదర్శన్‌రెడ్డి, మహబూబాబాద్‌ జడ్పీ అధ్యక్షురాలు ఆంగోతు బిందు ఉన్నారు.

ఐదో రోజు ఆరు నామినేషన్లు

మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానానికి మంగళవారం ఆరుగురు నామపత్రాలు దాఖలు చేశారు. భారాస అభ్యర్థి మాలోత్‌ కవితతోపాటు ఆదివాసీ ఐకాస సంఘాల తరపున మాజీ ఎమ్మెల్యే చందా లింగయ్య, స్వతంత్ర అభ్యర్థులు బానోత్‌ ప్రేమ్‌లాల్‌, పోరిక శ్యామల్‌నాయక్‌, జాటోత్‌ రఘువర్మ, సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ అభ్యర్థి మోకాళ్ల మురళీకృష్ణ నామినేషన్లు వేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని