logo

ప్రజాస్వామ్య పండగకు ఆహ్వానం..!

ఒక శుభకార్యానికి ఆహ్వానించినట్లుగా ఓటు వేయడానికి రమ్మనే పిలుపుతో ముద్రించిన ఈ ఆహ్వాన పత్రిక ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది.

Updated : 05 May 2024 07:12 IST

ఒక శుభకార్యానికి ఆహ్వానించినట్లుగా ఓటు వేయడానికి రమ్మనే పిలుపుతో ముద్రించిన ఈ ఆహ్వాన పత్రిక ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. వేడుకను మే 13న జరిగే లోక్‌సభ ఎన్నికలను ప్రజాస్వామ్య పండగగా పేర్కొన్నారు. అర్హులైన ఓటర్లందరూ ఓటు వేసేందుకు తరలి రావాలని కోరారు. పోలింగ్‌ వేళలను వేడుక సమయంగా చూపించారు. అయిదేళ్ల ప్రజాస్వామ్య ఫలాలను విందుగా పేర్కొన్నారు. ప్రజల్లో చైతన్యం రగల్చడానికి దీనిని రూపకల్పన చేసినట్లు ఆఖరులో ఒక వాక్యం జోడించారు. అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఆహ్వాన పత్రిక శనివారం మహబూబాబాద్‌, డోర్నకల్‌ ప్రాంతాల్లోని సామాజిక మాధ్యమాల్లో చక్కర్లుకొట్టింది.

న్యూస్‌టుడే, డోర్నకల్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని