logo

పరుగెత్తి.. ఓటు విలువ చాటి..

ఓటర్లను చైతన్యవంతం చేసి పోలింగ్‌శాతాన్ని పెంచాలనే లక్ష్యంతో వరంగల్‌ నగరంలో ఆదివారం ఏర్పాటు చేసిన 5కె రన్‌ ఉత్సాహంగా జరిగింది. హనుమకొండ జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియం నుంచి అంబేడ్కర్‌ కూడలి, కాళోజీ సెంటర్‌ మీదుగా కలెక్టరేట్ వరకు పరుగు సాగింది.

Published : 06 May 2024 06:42 IST

అనంతరం క్రీడాకారులు, యువత, శిక్షణ

ఓటు ప్రతిజ్ఞ చేస్తున్న సీఎండీ వరుణ్‌రెడ్డి, సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా, ఎన్నికల పరిశీలకురాలు స్వాగత్‌ రణ్వీర్‌చంద్‌, వరంగల్‌, హనుమకొండ కలెక్టర్లు ప్రావీణ్య, సిక్తా పట్నాయక్‌, కేయూ వీసీ రమేశ్‌, వ్యయ పరిశీలకులు ధిలీబన్‌, ధీరజ్‌సింగా, గ్రేటర్‌ కమిషనర్‌ అశ్విని తానాజీ, అదనపు కలెక్టర్లు రాధికగుప్తా, సంధ్యారాణి తదితరులు

ఓటర్లను చైతన్యవంతం చేసి పోలింగ్‌శాతాన్ని పెంచాలనే లక్ష్యంతో వరంగల్‌ నగరంలో ఆదివారం ఏర్పాటు చేసిన 5కె రన్‌ ఉత్సాహంగా జరిగింది. హనుమకొండ జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియం నుంచి అంబేడ్కర్‌ కూడలి, కాళోజీ సెంటర్‌ మీదుగా కలెక్టరేట్ వరకు పరుగు సాగింది. వరంగల్‌, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, సిక్తాపట్నాయక్‌, సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా జెండా ఊపి పరుగును ప్రారంభించారు. వరంగల్‌, హనుమకొండ కలెక్టర్లు ప్రావీణ్య మాట్లాడుతూ  ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతిఒక్కరూ ఓటు వేయాలన్నారు.

వరంగల్‌ కలెక్టర్‌ ప్రావీణ్య

కానిస్టేబుళ్లు, జిల్లా యంత్రాంగం ఈ నెల 13న ఓటు వేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఎన్నికల్లో పోలింగ్‌కు సంబంధించిన సందేహాల నివృత్తి కోసం వరంగల్‌ నిట్‌ విద్యార్థులు రూపొందించిన ‘ఓటర్‌ బడ్డీ’ లోగోను ఆవిష్కరించారు. 5కె పరుగులో గెలిచిన విజేతలకు ప్రశంసాపత్రాలు, మెడల్స్‌ అందించారు. కార్యక్రమంలో శిక్షణ ఐపీఎస్‌ అధికారి శుభం, ఎన్‌ఐటీ డైరెక్టర్‌ విద్యాధర్‌ సుభుది, డీసీపీ అబ్దుల్‌బారీ, వరంగల్‌, హనుమకొండ జిల్లాల ఇతర ఉన్నతాధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వాకర్స్‌, దివ్యాంగులు పాల్గొన్నారు. 

హనుమకొండ కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌

ఓటేస్తామని చాటిచెబుతూ..

ఉరకలెత్తే ఉత్సాహం..

ప్రతిజ్ఞ చేస్తున్న శిక్షణ కానిస్టేబుళ్లు

న్యూస్‌టుడే, వరంగల్‌ క్రీడావిభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని