logo

కుప్పకూలి ఉపాధి కూలీ మృతి

ఉపాధి పనికి వెళ్లిన కూలీ గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందిన ఘటన వీరవాసరంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. వీరవాసరం గ్రామానికి చెందిన మామిడిశెట్టి వాసు (44) శనివారం ఉపాధి పనికి వెళ్లారు.

Published : 05 May 2024 05:39 IST

వాసు (పాత చిత్రం)

వీరవాసరం, న్యూస్‌టుడే: ఉపాధి పనికి వెళ్లిన కూలీ గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందిన ఘటన వీరవాసరంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. వీరవాసరం గ్రామానికి చెందిన మామిడిశెట్టి వాసు (44) శనివారం ఉపాధి పనికి వెళ్లారు. ఆయనకు గుండెపోటు రావడంతో పని ప్రదేశంలోనే కుప్పకూలిపోయారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆయనను ద్విచక్రవాహనంపై ఆసుపత్రికి తరలిస్తుండగా ఫిట్స్‌ వచ్చి ప్రాణాలు వదిలారు. దీనిపై అధికారులకు సమాచారం ఇచ్చినట్లు క్షేత్ర పరిశీలకుడు బాలకృష్ణ తెలిపారు. వాసుకు భార్య, ఇద్దకు కుమారులు ఉన్నారు.


కట్నం కోసం వేధింపులు

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: అదనపు కట్నం కోసం భర్త రామకృష్ణంరాజు, అత్తమామలు వేధిస్తున్నారంటూ పట్టణానికి చెందిన యు.రోహిణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు శనివారం కేసు నమోదు చేసినట్లు రెండోపట్టణ పోలీసులు చెప్పారు.


బీరు సీసాతో దాడి

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: పాత గొడవల నేపథ్యంలో బీరు సీసాతో దాడి చేసిన ఘటన భీమవరం ఒకటోపట్టణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శుక్రవారం రాత్రి జరిగింది. ఎస్సై ఎం.వెంకటేశ్వరరావు కథనం ప్రకారం.. ఎం.చిన్న తన స్నేహితులతో ఉండగా ఎం.రాజు వచ్చి సీసా పగులగొట్టి మెడపై గాయపరిచాడు. చిన్న ప్రస్తుతం ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఎస్సై చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని