Murder: కడపలో దారుణహత్య.. యువకుడి శరీరంపై 20 కత్తిపోట్లు!
కడప రెండో పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. తోటి స్నేహితులే కత్తులతో పొడిచి చంపేశారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ వెంకటశివారెడ్డి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు కడపలోని..
కడప (క్రైమ్): కడప రెండో పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. తోటి స్నేహితులే కత్తులతో పొడిచి చంపేశారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ వెంకటశివారెడ్డి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు కడపలోని ఖలీల్ నగర్‌కు చెందిన ఇమ్రాన్ బాషా(23) అదే ప్రాంతానికి చెందిన షేక్ హర్షిత్, షేక్ మాలిక్ స్నేహితులు. ఇటీవల ఇమ్రాన్ బాషా తన ఇద్దరు స్నేహితుల వద్ద అప్పుడప్పుడు బెదిరించి కొంత డబ్బు తీసుకున్నాడు.
ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం వారిద్దరినీ మరోసారి డబ్బు అడిగాడు. వారు నిరాకరించడంతో ముగ్గురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇంతలో షేక్ హర్షిత్, షేక్ మాలిక్ వారి వద్ద ఉన్న కత్తులు తీసుకొని ఇమ్రాన్ బాషాపై దాడి చేశారు. విచక్షణారహితంగా కత్తులతో పొడిచి హత్య చేశారు. మృతుడి శరీరంపై 20 కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులు పరారీలో ఉన్నారని.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనాసురుడి రాజ్యం.. ఆరోగ్యశ్రీకి అనారోగ్యం...!
[ 27-04-2024]
కడప నగరానికి చెందిన ఓ వ్యక్తి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ స్థానికంగా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. వైద్య పరీక్షల అనంతరం శస్త్రచికిత్స చేయాలని వైద్యులు తెలిపారు. -
మరుపురానిది ‘జగనాసుర రక్తచరిత్ర’!
[ 27-04-2024]
‘జగనాసుర రక్తచరిత్ర’ మరుపురానిదని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి అన్నారు. గత ఐదేళ్ల వైకాపా పాలనలో జిల్లాలో జరిగిన అరాచకాలు చరిత్రకెక్కుతాయని వివరించారు. -
జగన్ హామీకి తొండి... పరిహారానికి గండి..!
[ 27-04-2024]
కొండాపురం మండలంలో పెన్నా, చిత్రావతి నదులు కలిసే చోట 26.85 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో గండికోట జలాశయం నిర్మించడంతో కొండాపురం, ముద్దనూరు మండలాల పరిధిలోని 22 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. -
న్యాయం చేస్తానన్నావ్...సాయం చేయకున్నావ్...!
[ 27-04-2024]
సోమశిల వెనుక జలాలతో ముంపు గ్రామాల ప్రజలు అధైర్యపడొద్దు. మీకు మా ప్రభుత్వం అండగా ఉంటుంది. మీరంతా సంతృప్తి చెందేలా పునరావాస ప్యాకేజీ వర్తింపజేస్తాం. -
నేత్రపర్వంగా పురుషోత్తముడికి పుష్పాభిషేకం
[ 27-04-2024]
ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శుక్రవారం పురుషోత్తముడి పుష్పాభిషేకం నేత్రపర్వంగా సాగింది. శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలను తొమ్మిది రోజుల పాటు వైభవంగా నిర్వహించారు. -
ముగిసిన నామినేషన్ల పరిశీలన
[ 27-04-2024]
జిల్లాలో నామినేషన్ల పరిశీలన శుక్రవారం పూర్తయింది. కడప పార్లమెంట నియోజకవర్గానికి సంబంధించి 32 నామపత్రాలు దాఖలు కాగా 14 ఆమోదించారు. -
30న పీలేరు, మైదుకూరులలో సీఎం జగన్ బహిరంగ సభలు
[ 27-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా మైదుకూరు, పీలేరులో ఈ నెల 30న నిర్వహించే బహిరంగ సభల్లో సీఎం జగన్ పాల్గొననున్నారు. -
పెద్దిరెడ్డి కుటుంబాన్ని సాగనంపండి
[ 27-04-2024]
రాష్ట్రంలో ధర్మానికి అధర్మానికి మధ్య ఎన్నికల యుద్ధం జరుగుతోందని, ప్రజలు ఎవరికి ఓటు వేస్తారో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని మాజీ సీఎం, భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. -
ఆపు నీ డప్పు... ఇవ్వు మా డబ్బు!
[ 27-04-2024]
జిల్లాలో గతేడాది మిగ్జాం తుపాను ప్రభావంతో పంటలు కోల్పోయిన రైతులకు పరిహారం అందే అవకాశాలు కనిపించట్లేదు. -
క్షణం క్షణం... భయం భయం
[ 27-04-2024]
ఇళ్లలో ఉంటే విద్యుత్తు తీగలు ఎప్పుడు కింద పడుతాయోననే భయం.. ఆరుబయటికి వస్తే పిల్లలు తెలియక తక్కువ ఎత్తులో ఉన్న ట్రాన్స్ఫార్మర్లను తాకి ప్రమాదాల బారిన పడుతారేమోననే ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది.