logo

నేత్రానందకరం... ధ్వజారోహణం

వాల్మీకి క్షేత్ర శ్రీపట్టాభిరాముడి ఆలయంలో శ్రీశోభకృత్‌నామ సంవత్సరాన్ని పురస్కరించుకుని శ్రీరాముడి వార్షిక సాలకట్ల బహ్మోత్సవాలలో భాగంగా సోమవారం ధ్వజారోహణ కార్యక్రమం తితిదే వేదపండితులు మంత్రోచ్ఛరణల మధ్య కనుల పండువగా నిర్వహించారు.

Published : 28 Mar 2023 03:14 IST

ధ్వజారోహణం నిర్వహిస్తున్న వేదపండితులు

వాల్మీకిపురం, న్యూస్‌టుడే: వాల్మీకి క్షేత్ర శ్రీపట్టాభిరాముడి ఆలయంలో శ్రీశోభకృత్‌నామ సంవత్సరాన్ని పురస్కరించుకుని శ్రీరాముడి వార్షిక సాలకట్ల బహ్మోత్సవాలలో భాగంగా సోమవారం ధ్వజారోహణ కార్యక్రమం తితిదే వేదపండితులు మంత్రోచ్ఛరణల మధ్య కనుల పండువగా నిర్వహించారు. ముందుగా స్వామి వారికి సుప్రభాతసేవతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఆలయ ఆస్థాన మండపంలో ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనసేవ నిర్వహించారు. సాయంత్రం స్వామివార్లకు ఊంజల్‌సేవ నిర్వహించారు. తితిదే వేద పండితులు మణికంఠ భట్టార్‌, తితిదే స్థానిక ఆలయాల డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఆలయ ప్రధాన అర్చకులు సాలిగ్రామ శ్రీనివాసాచార్యులు, ఏఈవో గురుమూర్తి, సూపరింటెండెంట్‌ మునిచెంగల్‌రాయులు, ఆలయాధికారి కృష్ణమూర్తి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని