logo

రైతుల సంక్షేమానికి పెద్దపీట

రాష్ట్రంలో రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ సాగు విస్తీర్ణాన్ని పెంచేదిశగా వైయస్‌ఆర్‌ యంత్ర సేవా పథకం ఉపయోగపడుతుందని కలెక్టర్‌ విజయరామరాజు పేర్కొన్నారు.

Published : 03 Jun 2023 02:33 IST

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ సాగు విస్తీర్ణాన్ని పెంచేదిశగా వైయస్‌ఆర్‌ యంత్ర సేవా పథకం ఉపయోగపడుతుందని కలెక్టర్‌ విజయరామరాజు పేర్కొన్నారు. కలెక్టర్‌ కార్యాలయంలో శుక్రవారం ఆయన వ్యవసాయ సలహాదారు తిరుపేలరెడ్డి, ఉద్యాన సలహాదారు శివప్రసాద్‌రెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ గణేష్‌కుమార్‌తో కలిసి పలువురు రైతులకు ట్రాక్టర్లు, యంత్ర పరికరాలు అందజేశారు. అనంతరం పలువురు రైతులకు అందించిన ట్రాక్టర్లను వారు జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో డీఏవో నాగేశ్వరరావు, ఆత్మ పీడీ డాక్టర్‌ విజయలక్ష్మీ, ఉద్యానశాఖ డీడీ మైఖేల్‌ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో పారిశ్రామిక ఎగుమతులను పెంచేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ పేర్కొన్నారు. ్య పరిశ్రమలే ఆర్థిక ప్రగతికి మూలమని అందుకోసం ఐడీపీలో 51 యూనిట్లకు గానూ రూ.7.62 కోట్ల రాయితీ విడుదలకు ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పరిశ్రమలశాఖ జనరల్‌ మేనేజరు జయలక్ష్మీ, ఏపీఐఐసీ జోనల్‌ మేనేజరు శ్రీనివాసమూర్తి, ఎల్డీఎం దుర్గాప్రసాద్‌ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల ఐదో తేదీ నిర్వహించే గ్రీన్‌ ర్యాలీని విజయవంతం చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని తన ఛాంబరులో పర్యావరణ పరిరక్షణకు రూపొందించిన గోడపత్రాలను కలెక్టర్‌ ఆవిష్కరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని