icon icon icon
icon icon icon

Actor Shekhar: భాజపాలోకి నటుడు శేఖర్ సుమన్

ఇటీవల కాంగ్రెస్‌ను వీడిన నటుడు శేఖర్‌ సుమన్‌, కాంగ్రెస్ మాజీ నేత రాధికా ఖేడా ఇద్దరూ భాజపాలో చేరారు.

Published : 07 May 2024 16:10 IST

దిల్లీ: నటుడు శేఖర్ సుమన్, కాంగ్రెస్‌ మీడియా మాజీ సమన్వయకర్త రాధికా ఖేడా మంగళవారం పార్టీ ప్రధాన కార్యాలయంలో భాజపాలో చేరారు. వీరిరువురూ కాంగ్రెస్ నేతలు తమను వేధిస్తున్నారని ఆరోపిస్తూ గత వారం పార్టీకి రాజీనామా చేశారు. 

శేఖర్‌ మాట్లాడుతూ ‘‘జీవితంలో మనకు తెలియకుండా చాలా విషయాలు జరుగుతాయి. ఈ రోజు ఇక్కడ ఉంటానని నిన్నటివరకు నేను అనుకోలేదు. సానుకూల ఆలోచనలతోనే నేను భాజపాలో చేరాను. నన్ను ఈ పార్టీలోకి వచ్చేలా చేసిన భగవంతుడికి  కృతజ్ఞతలు’’ అని తెలిపారు. ఆయన ఇటీవల సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘హీరామండి’ చిత్రంలో నటించారు.

రాధికా ఖేడా  మాట్లాడుతూ ‘‘నేను రామ్‌లల్లా దర్శనం చేసుకున్నందుకు కాంగ్రెస్‌లోని కొందరు నేతలు నాతో అనుచితంగా ప్రవర్తించారు. కాంగ్రెస్‌ రాముడిని, హిందూ మతాన్ని వ్యతిరేకించే పార్టీ. భాజపా నాకు మద్దతుగా నిలిచింది. కాబట్టే నేను ఈ పార్టీలోకి వచ్చాను. అందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు’’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img