icon icon icon
icon icon icon

Priyanka Gandhi: కాంగ్రెస్‌ మేనిఫెస్టోపై భాజపా దుష్ప్రచారం - ప్రియాంకాగాంధీ

వాస్తవ సమస్యల నుంచి ప్రజల దృష్టి మరలించేందుకు భాజపా నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని కాంగ్రెస్‌ నేత ప్రియాంకా గాంధీ విమర్శించారు.

Published : 09 May 2024 18:21 IST

రాయ్‌బరేలీ: తమ పార్టీ మేనిఫెస్టోపై భాజపా అసత్య ప్రచారాలు చేస్తోందని కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ ప్రియాంకా గాంధీ (Priyanka Gandhi) ఆరోపించారు. ఈ క్రమంలో ప్రధానమంత్రి కూడా పదవీ గౌరవాన్ని మరిచిపోయి మాట్లాడుతున్నారని అన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నుంచి పోటీ చేస్తున్న రాహుల్‌కు మద్దతుగా అక్కడ ప్రచారం నిర్వహించిన ప్రియాంక.. వాస్తవ సమస్యల నుంచి ప్రజల దృష్టి మరలించేందుకు భాజపా (BJP) నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు.

‘ఎన్నికల సమయంలో పెట్టే టీవీ చర్చల్లో పాల్గొనే భాజపా నేతలు వాస్తవ సమస్యలను పక్కనపెట్టి మతపరమైన అంశాలను లేవనెత్తుతారు. మీ సంపదను కాంగ్రెస్‌ లాక్కుంటుందని చెబుతారు. ఎక్స్‌-రే మిషిన్లను తీసుకువచ్చి తనిఖీలు చేస్తారని, మీ నగదును తీసుకుపోతారని ప్రచారం చేస్తున్నారు. అత్యున్నత పదవిలో ఉన్న ప్రధాని మోదీ కూడా అదేవిధంగా వ్యవహరిస్తున్నారు. మనసుకి ఏది తోస్తే అది మాట్లాడుతున్నారు. అసలు ప్రశ్నలు లేవనెత్తనీయరు. ఎందుకంటే, గత పదేళ్లలో మోదీ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు’ అని ప్రియాంకాగాంధీ ఆరోపించారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని, నల్లధనం వెనక్కి తెస్తామని, అందులోనుంచి ప్రజల ఖాతాల్లో రూ.15 లక్షల చొప్పున వేస్తామని చెప్పిన మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు.

ప్రియాంకా గాంధీ.. ఎందుకు పోటీ చేయట్లేదు?

పేద ప్రజల కోసం ఏ ఒక్క పథకమూ లేదని.. అన్ని విధానాలు బిలియనీర్ల కోసమే కేంద్రప్రభుత్వం రూపొందిస్తోందని ప్రియాంకాగాంధీ ఆరోపించారు. విపక్షాల కూటమి ‘ఇండియా’ అధికారంలోకి వస్తే రైతు రుణాల మాఫీ కోసం ఓ కమిషన్‌ను ఏర్పాటుచేస్తామన్నారు. అంతేకాకుండా వ్యవసాయ ఉత్పత్తులను జీఎస్టీ నుంచి మినహాయిస్తామని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img