Modi: మీ ఓటు ఏం చేయగలదో తెలుసా..: ప్రధాని మోదీ
నాలుగో విడత ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ప్రతిపక్షాలపై పదునైన అస్త్రాలను ఎక్కుపెట్టారు. ఆయన మధ్యప్రదేశ్‌లో నిర్వహించిన సభలో పలు ఆరోపణలు చేశారు.
ఇంటర్నెట్‌డెస్క్: ప్రజల ఓటే భారత్‌ను ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టిందని, ప్రపంచంలో దేశ పరపతి పెంచిందని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. ఆయన మధ్యప్రదేశ్‌లోని ఖర్గోనేలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ప్రజా నిర్ణయంతోనే ఆదివాసి కుమార్తె రాష్ట్రపతి అయ్యారని, మహిళలకు రిజర్వేషన్లు లభించాయని, అవినీతిపరులు జైళ్లకు పోతున్నారని, ఉచిత రేషన్ వస్తోందన్నారు. కాంగ్రెస్ సృష్టించిన గోతులను పూడ్చుకొంటూ వచ్చిన భాజపా మధ్యప్రదేశ్‌కు సరికొత్త ఇమేజ్ను తీసుకొచ్చిందని తెలిపారు. భారత్ చరిత్రలోనే అత్యంత కీలక మలుపు వద్ద ఉందన్నారు.
‘‘నేను మంచి చేయబట్టే.. నాకు ఈ రోజుల ప్రజల మద్దతు లభిస్తోంది. వికసిత్ భారత్ కలలను సాకారం చేసుకొనేందుకు మరోసారి మీ ఆశీర్వాదం తీసుకొనేందుకు వచ్చాను. నర్మదా తీరంలోని ప్రజలు ఎవరినీ నిరాశపర్చరని తెలుసు’’ అని ప్రధాని పేర్కొన్నారు.
తమ వారసత్వాలను కాపాడుకొనేందుకే ‘ఇండియా కూటమి’లోని పక్షాలు ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయని ప్రధాని తెలిపారు. తమ సంతానానికి పార్టీలను అప్పజెప్పేందుకే ప్రతిపక్షాలు ఇలా చేస్తున్నాయని దుయ్యబట్టారు. వాటికి ప్రజల సంతోషంతో సంబంధం లేదన్నారు. ప్రతిపక్షాలు ఫేక్ వీడియోలు తయారు చేసే ఫ్యాక్టరీలుగా మారిపోయాయని ఎద్దేవా చేశారు. ప్రజలు ఏమైనా సరే తమ పని జరగడమే వాటికి ముఖ్యమన్నారు. తనపై ఓట్ జిహాద్ చేయాలని కాంగ్రెస్ పార్టీ కొన్ని వర్గాలకు పిలుపునిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. ఆ పార్టీ మూర్ఖత్వం ఆ స్థాయిలో ఉందన్నారు. నిరాశ వారిని చుట్టుముట్టిందని తెలిపారు. కాంగ్రెస్‌ను వీడిన నేతలు సంతోషంగా ఊపిరి పీల్చుకొంటున్నారని మోదీ వ్యాఖ్యానించారు. రామమందిరానికి వెళ్లినందుకు మహిళా నేతను ఆ పార్టీ వేధించినట్లు తెలిపారు. మావోయిస్టు, ముస్లిం లీగ్ పార్టీలను కాంగ్రెస్ హైజాక్ చేసిందన్నారు. ఆ పార్టీ యువరాజు సుప్రీం తీర్పును మార్చాలని చూస్తున్నట్లు ప్రధాని ఆరోపించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తదుపరి ప్రధాని అమిత్ షానే
దేశంలో రిజర్వేషన్లకు అంతం పలకడానికే తమకు 400 లోక్‌సభ సీట్లు కావాలని భాజపా కోరుకుంటోందని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, దిల్లీ సీఎం కేజ్రీవాల్ పునరుద్ఘాటించారు. -
దేశాన్ని నడపడం కిరాణాకొట్టు నిర్వహణ కాదు: అమిత్ షా
విపక్ష ఇండియా కూటమి ఒకవేళ అధికారంలోకి వచ్చినట్లయితే ఏడాదికొకరు చొప్పున ప్రధాని పదవిని పంచుకోవాలని అనుకుంటున్నారని, దేశాన్ని నడపడమంటే కిరాణాకొట్టు నిర్వహణలాంటిది కాదని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పేర్కొన్నారు. -
4 తర్వాత ఇండియా కూటమి ముక్కచెక్కలు
లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ‘ఇండియా’ కూటమి ముక్కచెక్కలు అవుతుందని ప్రధాని మోదీ జోస్యం చెప్పారు. ఓటమి అనంతరం ఎవరిని బలి పశువు చేయాలా అని కూటమి చూస్తుందన్నారు. -
మోదీజీ...యూపీలో నిరుద్యోగం ఎందుకు పెరుగుతోంది?
డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో అభివృద్ధి పరుగులు పెడుతుందని చెబుతున్న మీరు ఉత్తర్‌ప్రదేశ్‌లో తిష్ఠవేసిన సమస్యలకు ఏం సమాధానం చెబుతారు. -
‘ఆరో విడత’లో 338మంది కోటీశ్వరులు.. అత్యల్ప ఆస్తి రెండు రూపాయలే!
లోక్‌సభ ఆరో విడత స్థానాల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల్లో 338 మంది (39 శాతం) కోటీశ్వరులేనని ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR)’ తెలిపింది. -
యూపీలోనూ ‘టీఎంసీ’ తరహా రాజకీయాలకు యత్నం.. విపక్షాలపై మోదీ ధ్వజం
జూన్ 4న తర్వాత ‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నమవుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారు.. : కేజ్రీవాల్
Arvind Kejriwal: మోదీ రిటైర్మెంట్ గురించి కేజ్రీవాల్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారని అన్నారు. -
ప్రధానిపై పోటీ.. కమెడియన్ శ్యామ్ రంగీలాకు షాక్
Varanasi: వారణాసి నుంచి ప్రధానిపై పోటీకి దిగిన కమెడియన్ శ్యామ్ రంగీలా నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
400 సీట్లు గెలిస్తే.. పీవోకే విలీనం ఖాయం: హిమంత
సార్వత్రిక ఎన్నికల్లో భాజపా 400 సీట్లు గెలిస్తే.. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) భారత్‌లో విలీనం ఖాయమని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ పేర్కొన్నారు. -
అధికారంలోకి వచ్చేది మేమే
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే ప్రభుత్వమే కేంద్రంలో ఈసారి ముమ్మాటికీ రాబోతోందని ఆ పార్టీ అగ్రనేతలు ధీమా వ్యక్తం చేశారు. -
రాహుల్‌పై ఈసీకి భాజపా ఫిర్యాదు
రెండు రకాల సైనికులను మోదీ సర్కారు తీసుకువచ్చిందని చెప్పినందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీపై అత్యంత కఠిన చర్య తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని భాజపా కోరింది. -
ప్రపంచంలో ధనిక పార్టీ భాజపా
కాంగ్రెస్ అవినీతి పార్టీ అని భాజపా అంటుంది. కానీ నిజానికి పదేళ్లలోనే ప్రపంచంలో ధనికమైన పార్టీగా ఎదిగింది భాజపాయే. 55 ఏళ్లపాటు పాలించినా కాంగ్రెస్ అలా కాలేకపోయింది. -
నటుడిపై తల్లి పోటీ.!
బిహార్‌లోని కారాకట్ లోక్‌సభ నియోజకవర్గంలో పోటీ ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ప్రముఖ భోజ్‌పురి గాయకుడు, నటుడు పవన్‌సింగ్ పోటీకి దిగగా.. తాజాగా ఆయన తల్లి ప్రతిమాదేవి అదే స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయడం గమనార్హం. -
అధికారం కోసం మోదీ దేశాన్ని విభజిస్తున్నారు
ప్రధాని మోదీ అధికారంలో కొనసాగడం కోసం దేశాన్ని విభజిస్తున్నారని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా విమర్శించారు. -
నేను జైలుకెళ్లడం ముఖ్యం కాదు.. రాజ్యాంగం భద్రంగా ఉండడమే ప్రధానం
కేంద్రంలో విపక్ష ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అది దేశ అభ్యున్నతికి కృషి చేస్తుందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. -
కేజ్రీవాల్ బెయిల్ తీర్పు అసాధారణం
మద్యం కుంభకోణంలో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన మధ్యంతర బెయిల్ ఉత్తర్వులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. -
ఇండియా కూటమికి వెలుపలి నుంచి మద్దతు: మమత
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే వెలుపలి నుంచి తమ పార్టీ మద్దతు అందిస్తుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. -
కాంగ్రెస్ మత ప్రాతిపదికన బడ్జెట్ కేటాయింపులు కోరుకుంటోంది
కేంద్ర బడ్జెట్ కేటాయింపులు మత ప్రాతిపదికన ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. కానీ అలా బడ్జెట్‌ను విభజించడాన్ని తాను అనుమతించబోనని ఉద్ఘాటించారు. -
నటుడిపై తల్లి పోటీ.. అక్కడ పోరు ఆసక్తికరం!
ప్రముఖ భోజ్‌పురి నటుడు, సింగర్ పవన్‌సింగ్ పోటీ చేస్తున్న నియోజకవర్గం నుంచి తాజాగా ఆయన తల్లి నామినేషన్ వేశారు. -
ఇండియా కూటమికి బయటి నుంచి మద్దతిస్తాం: మమతా బెనర్జీ
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే దానికి తమ పార్టీ సహకారం అందిస్తుందని బెంగాల్ ముఖ్యమమంత్రి మమతా బెనర్జీ అన్నారు. -
కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ ‘అసాధారణమే’: అమిత్ షా
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ ఇస్తూ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అసాధారణంగా కనిపిస్తోందని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు.
తాజా వార్తలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
నిలిచిపోయిన కాగజ్‌నగర్, నవజీవన్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు .. ప్రయాణికుల ఆందోళన
-
భార్య, కుమారుడు వేధిస్తున్నారు, భరణం ఇప్పించండి - మాజీ మంత్రి వేడుకోలు
-
రాజస్థాన్, కోల్‌కతా మ్యాచ్‌కు వరుణుడి ఆటంకం.. మ్యాచ్ రద్దయితే హైదరాబాద్‌కు లాభం..
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..
-
కార్పొరేటర్ శ్రవణ్ అరెస్టు అప్రజాస్వామికం: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి