icon icon icon
icon icon icon

Sonia Gandhi: పరిస్థితులు ఏవైనా అధికారమే భాజపా లక్ష్యం : వీడియో సందేశంలో సోనియా విమర్శలు

ఎలాంటి పరిస్థితుల్లో అయినా అధికారాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా భాజపా ముందుకువెళ్తోందని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ(Sonia Gandhi) విమర్శించారు.

Published : 07 May 2024 18:08 IST

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల ప్రచారం వాడీవేడిగా జరుగుతోన్న తరుణంలో కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ (Sonia Gandhi) వీడియో సందేశం విడుదల చేశారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు విపక్ష ‘ఇండియా’ కూటమి పార్టీలు కట్టుబడి ఉన్నాయని చెప్పారు. అబద్ధాలు, విద్వేషాన్ని తిరస్కరించాలని, మెరుగైన భవిష్యత్తు కోసం కాంగ్రెస్‌కు ఓటువేయాలని ఓటర్లను కోరారు. భాజపా పాలనలో నిరుద్యోగం, మహిళలపై నేరాలు, కొన్ని వర్గాలపై వివక్ష తీవ్ర స్థాయికి చేరుకుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఎట్టి పరిస్థితుల్లో అధికారాన్ని పొందడమే భాజపా, ప్రధాని మోదీ లక్ష్యమని దుయ్యబట్టారు. అందరితో కలిసిపోవడం, చర్చలు జరపడాన్ని ఆ పార్టీ తోసిపుచ్చుతోందని విమర్శించారు. కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రధానమైన హామీ దేశాన్ని ఐక్యంగా ఉంచడమేనని, రైతులు, యువత, మహిళలు, అణగారిన వర్గాల అభివృద్ధి దిశగా తమ నిర్ణయాలు ఉంటాయని సోనియా వెల్లడించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img