icon icon icon
icon icon icon

ఆ వీడియోను తొలగించండి : ‘ఎక్స్‌కు’ ఈసీ ఆదేశం

ముస్లిం రిజర్వేషన్ల అంశంపై కర్ణాటక భాజపా షేర్‌ చేసిన ఓ వీడియోను తొలగించాలని ‘ఎక్స్‌’ను ఈసీ ఆదేశించింది.

Updated : 07 May 2024 20:26 IST

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రాజకీయ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఓటర్లను తమవైపు ఆకర్షించి ప్రత్యర్థుల్ని చిత్తు చేసేలా వివిధ రకాల ప్రచార అస్త్రాలను ఎంచుకొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ముస్లిం రిజర్వేషన్ల అంశంపై కర్ణాటక భాజపా షేర్‌ చేసిన ఓ వీడియో వివాదాస్పదమైంది. దీనిపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయగా.. ఎన్నికల సంఘం అధికారులు సైతం స్పందించారు. ముస్లిం రిజర్వేషన్ల వ్యవహారంపై షేర్‌ చేసిన ఈ యానిమేటెడ్‌ వీడియోను తొలగించాలని కేంద్ర ఎన్నికల సంఘం ‘ఎక్స్‌’ను మంగళవారం ఆదేశించింది. కర్ణాటక సైబర్‌ క్రైం డివిజన్‌ పోలీసులు, చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ ఈ అభ్యంతరకర వీడియోపై మే 5న ‘ఎక్స్‌’ ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా, తొలగించలేదని లేఖలో పేర్కొంది. అందువల్ల తక్షణమే ఆ యానిమేటెడ్‌ వీడియోని తొలగించాలని ఆదేశిస్తూ ఈసీ లేఖ రాసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img