icon icon icon
icon icon icon

సంక్షిప్త వార్తలు (6)

ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ మూడవసారి అధికారం చేపట్టడం ఖాయం. ఒకవేళ పొరపాటున ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఎం.కె.స్టాలిన్‌, శరద్‌పవార్‌, లాలూప్రసాద్‌, మమతాబెనర్జీ ఒక్కో ఏడాది చొప్పున ప్రధాని కుర్చీని పంచుకుంటారు.

Updated : 30 Apr 2024 22:47 IST

వాళ్లు ప్రధాని పీఠాన్ని పంచుకుంటారు

ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ మూడవసారి అధికారం చేపట్టడం ఖాయం. ఒకవేళ పొరపాటున ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఎం.కె.స్టాలిన్‌, శరద్‌పవార్‌, లాలూప్రసాద్‌, మమతాబెనర్జీ ఒక్కో ఏడాది చొప్పున ప్రధాని కుర్చీని పంచుకుంటారు. ఇక ఎంత మిగిలితే అంతకాలంతో రాహుల్‌గాంధీ సర్దుకుపోవాలి. దేశాన్ని నడిపేది అలాగేనా?

బిహార్‌లోని ఝంఝార్‌పుర్‌ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా


అంటే ఓటమిని అంగీకరించినట్లేగా

ప్రధాని పదవిని విపక్షంలో ఎవరెవరు పంచుకుంటారో అమిత్‌షా చెప్పారంటే ఓటమిని భాజపా కూటమి అంగీకరించినట్లేగా..! 400 సీట్ల గురించి చెప్పినవాళ్లే ఇప్పుడు తదుపరి సర్కారు ఇండియా కూటమిదేనని ఒప్పుకొంటున్నారు. దానికిగానూ వారికి నా కృతజ్ఞతలు.

విలేకరులతో కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనేత్‌


రిజర్వేషన్లు తీసేస్తామంటే ఊరుకోం

బలహీనవర్గాల రిజర్వేషన్ల తొలగింపునకు, రాజ్యాంగాన్ని మార్చేందుకు ఎన్డీయే సర్కారు కుట్ర చేస్తోంది. దీనిని ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించబోం. లౌకిక, ప్రజాతంత్ర కూర్పును కాపాడుకుంటాం. నా కుమార్తె రోహిణిని ఇక్కడ గెలిపించండి.

బిహార్‌లోని సారణ్‌లో ఆర్జేడీ అధ్యక్షుడు లాలూప్రసాద్‌ రాజ్యాంగ రక్షకులకు, ప్రజాస్వామ్య


విధ్వంసకారులకు మధ్య పోరు ఇది

రాజ్యాంగాన్ని నాశనం చేయాలని చూస్తున్నవారిని, దానిని రక్షించాలనుకుంటున్నవారికి మధ్య పోరు ఇది. భాజపా చేసిన ఏ వాగ్దానం నెరవేరలేదని అందరికీ తెలుసు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని, గిట్టుబాటుధరలు కల్పిస్తామని చెప్పిన నేతలు వాటిని ఏం చేశారు? భాజపా కూటమి ఓటమి ఖాయం.

యూపీలోని ఎటా జిల్లాలో సమాజ్‌వాదీ అధ్యక్షుడు అఖిలేశ్‌


ఉమ్మడి పౌరస్మృతితో హిందువులకు ప్రయోజనం శూన్యం

ఉమ్మడి పౌరస్మృతి వల్ల హిందువులకు ఎలాంటి ప్రయోజనం లేదు. ఎన్నికల సమయాల్లో మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టడానికి ఇలాంటి ఏదో ఒక అంశాన్ని తెరపైకి భాజపా తీసుకొస్తుంది. కాంగ్రెస్‌, సీపీఎం భాజపా ఏజెంట్లు. తొలిరెండు దశల ఎన్నికల తర్వాత దేశవ్యాప్తంగా భాజపా వ్యతిరేక గాలి స్పష్టంగా కనిపిస్తోంది. మిగతా ఐదు దశల్లోనూ ఆ పార్టీకి ఓటమి ఖాయం.

ముర్షీదాబాద్‌ జిల్లా జంగీపుర్‌లో పశ్చిమ బెంగాల్‌ సీఎం మమత


మొఘలుల అకృత్యాలపై రాహుల్‌ మాట్లాడాలి

అయోధ్య, మథురలలో ఆలయాలను ధ్వంసం చేసిన మొఘల్‌ చక్రవర్తుల అకృత్యాలపై రాహుల్‌ మాట్లాడాలి. దేశచరిత్రపై ఆయనకు తగిన అవగాహన లేదు. విప్లవ శక్తుల ఒత్తిడితోనే పౌరసత్వ సవరణ చట్టంపై విపక్షాలు నిరసన వ్యక్తపరుస్తున్నాయి.

యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img