icon icon icon
icon icon icon

అయిదుగురు మంత్రులు.. ఇద్దరు డిప్యూటీ సీఎంలు

జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ (ఎస్సీ) నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ స్థానం నుంచి నెగ్గినవారిలో అయిదుగురు రాష్ట్ర మంత్రులుగా పనిచేశారు. ఇద్దరు ఉప ముఖ్యమంత్రులుగా వ్యవహరించారు.

Published : 11 Nov 2023 05:28 IST

స్టేషన్‌ ఘన్‌పూర్‌ ప్రత్యేకత ఇది 

జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ (ఎస్సీ) నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ స్థానం నుంచి నెగ్గినవారిలో అయిదుగురు రాష్ట్ర మంత్రులుగా పనిచేశారు. ఇద్దరు ఉప ముఖ్యమంత్రులుగా వ్యవహరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1972లో కాంగ్రెస్‌ నుంచి గెలుపొందిన టి.హయగ్రీవాచారి దేవాదాయశాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత ఘన్‌పూర్‌ ఎస్సీ రిజర్వుడు కావడంతో ఇక్కడి నుంచి 1978లో కాంగ్రెస్‌ నుంచి గోకరామస్వామి గెలుపొందారు. రెండోసారి కూడా ఆయనే నెగ్గారు. మొదటిదఫాలో పౌరసరఫరాల శాఖ, రెండో పర్యాయం రవాణా, మత్స్య, ఉద్యానాభివృద్ధి శాఖల మంత్రిగా చేశారు. అనంతరం 1994లో తెదేపా నుంచి ఎన్నికైన కడియం శ్రీహరి మార్కెటింగ్‌, సాంఘిక సంక్షేమ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. కడియం రెండోసారి 1999లో విజయం సాధించాక భారీ నీటిపారుదల శాఖ, విద్యాశాఖ మంత్రిగా అవకాశం దక్కింది. ఆ తర్వాత కాంగ్రెస్‌ పొత్తుతో తెరాస అభ్యర్థిగా పోటీచేసిన గుండె విజయరామారావు ఎన్నికల్లో గెలిచి పౌరసరఫరాల శాఖ మంత్రిగా చేశారు. 2014లో తెరాస నుంచి గెలుపొందిన రాజయ్య తొలి ఉప ముఖ్యమంత్రిగా, వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా పని చేశారు. తర్వాత జరిగిన పరిణామాలతో కడియం శ్రీహరికి తెరాస ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి, ఉప ముఖ్యమంత్రి బాధ్యతలతోపాటు విద్యాశాఖను అప్పగించారు. తాజా ఎన్నికల్లో కడియం శ్రీహరి భారాస తరఫున బరిలో ఉండగా, గుండె విజయరామారావు భాజపా నుంచి పోటీ చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img