icon icon icon
icon icon icon

తొలి ముఖ్యమంత్రి ఉమ్మడి జిల్లా వాసే..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌ జిల్లా వాసులు విలక్షణ తీర్పు అందించారు. హైదరాబాద్‌ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఉమ్మడి జిల్లా వాసి కావడం విశేషం. 1952లో రాష్ట్రంలో ఏకసభ్య విధానంతో జరిగిన ఎన్నికల్లో షాద్‌నగర్‌ నుంచి బూర్గుల రామకృష్ణారావు గెలిచారు.

Published : 15 Nov 2023 12:39 IST

విలక్షణ తీర్పునకు పాలమూరు వేదిక

బూర్గుల రామకృష్ణారావు

కొత్తకోట, న్యూస్‌టుడే : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌ జిల్లా వాసులు విలక్షణ తీర్పు అందించారు. హైదరాబాద్‌ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఉమ్మడి జిల్లా వాసి కావడం విశేషం. 1952లో రాష్ట్రంలో ఏకసభ్య విధానంతో జరిగిన ఎన్నికల్లో షాద్‌నగర్‌ నుంచి బూర్గుల రామకృష్ణారావు గెలిచారు. ఆయనే హైదరాబాద్‌ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఎన్నికై ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు వన్నె తీసుకు వచ్చారు. నిజాంకు వ్యతిరేకంగా హైదరాబాద్‌ రాష్ట్రాన్ని కోరుతూ చేపట్టిన ఉద్యమాల్లో బూర్గుల చేసిన అలుపెరగని పోరాటంతో ఈ అవకాశం దక్కింది. (ఈ ఎన్నికల్లో మొత్తం 15 మందిని ఎన్నుకోగా వీరిలో ఇద్దరు స్వతంత్రులు, ఒకరు పీడీఎఫ్‌ సభ్యుడు, మిగిలిన 12 మంది కాంగ్రెస్‌కు చెందిన వారు ఎన్నికయ్యారు.)

ఎన్టీఆర్‌కు తప్పని ఓటమి

1983లో రాష్ట్రంలో తొలిసారిగా ఎన్టీఆర్‌ నేతృత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడింది. 1989లో నాటి ముఖ్యమంత్రి ఎన్టీరామారావు కల్వకుర్తి నుంచి పోటీ చేసి.. కాంగ్రెస్‌ అభ్యర్థి చిత్తరంజన్‌దాస్‌ చేతిలో ఓటమి చెందారు. అప్పట్లో రాష్ట్రంలో సంచలనమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img