icon icon icon
icon icon icon

ఆవిర్భావం నుంచీ వారే!

2009లో నియోజకవర్గాల పునర్విభజన జరగ్గా ఉమ్మడి జిల్లాలో కోరుట్ల, వేములవాడ, ధర్మపురి, రామగుండం, మానకొండూర్, హుస్నాబాద్‌ కొత్తగా ఏర్పడ్డాయి. వీటిలో మూడింట్లో ఆవిర్భావం నుంచీ ఒక్కొక్కరే గెలుపు బావుటా ఎగరేశారు.

Published : 16 Nov 2023 12:04 IST

2009లో నియోజకవర్గాల పునర్విభజన జరగ్గా ఉమ్మడి జిల్లాలో కోరుట్ల, వేములవాడ, ధర్మపురి, రామగుండం, మానకొండూర్, హుస్నాబాద్‌ కొత్తగా ఏర్పడ్డాయి. వీటిలో మూడింట్లో ఆవిర్భావం నుంచీ ఒక్కొక్కరే గెలుపు బావుటా ఎగరేశారు. కోరుట్లలో 2009, 2010 ఉప ఎన్నిక, 2014, 2018 ఎన్నికల్లో వరుస విజయాలను సొంతం చేసుకున్న కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు ఈసారి తన కుమారుడిని బరిలో నిలిపారు. ధర్మపురిలో 2009, 2010 ఉప ఎన్నిక, 2014, 2018 ఎన్నికల్లో గెలుపొందిన కొప్పుల ఈశ్వర్‌ అంతకుముందు మేడారం నియోజకవర్గం నుంచి 2004, 2008(ఉప ఎన్నిక)లో విజయం సాధించారు. ప్రస్తుతం మరోసారి బరిలో నిలిచారు. వేములవాడ ఆవిర్భావం నుంచి మూడు సాధారణ, ఒక ఉప ఎన్నికలో చెన్నమనేని రమేశ్‌బాబు గెలుపొందారు. పోటీకి దూరంగా ఉన్నారు. రామగుండంలో 2009, 2014 ఎన్నికల్లో సోమారపు సత్యనారాయణ, 2018లో కోరుకంటి చందర్‌ విజయం సాధించారు. మానకొండూర్‌లో 2009లో ఆరెపల్లి మోహన్, 2014, 2018 ఎన్నికల్లో రసమయి బాలకిషన్‌ గెలుపొందారు. హుస్నాబాద్‌లో  2009లో ఎ.ప్రవీణ్‌రెడ్డి గెలవగా 2014, 2018 ఎన్నికల్లో ఒడితెల సతీష్‌కుమార్‌ విజయం సాధించారు. రామగుండం, మానకొండూర్, హుస్నాబాద్‌లో ప్రస్తుత ఎమ్మెల్యేలు మరోసారి అదృష్టం పరీక్షించుకుంటున్నారు. 

-న్యూస్‌టుడే, మేడిపల్లి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img