icon icon icon
icon icon icon

Mainpuri: ఎస్పీ కంచుకోట ‘మైన్‌పురీ’

సమాజ్‌వాదీ పార్టీకి ‘మైన్‌పురీ’ నియోజకవర్గం కంచుకోటలా ఉంది. ఇక్కడినుంచి ఆ పార్టీ అధినేత సతీమణి డింపుల్‌ యాదవ్‌ తిరిగి పోటీ చేస్తున్నారు.

Published : 06 May 2024 16:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం: ఉత్తర్‌ప్రదేశ్‌లో మొత్తం 80 లోక్‌సభ స్థానాలు ఉండగా.. అందులో ‘మైన్‌పురీ’ సమాజ్‌వాదీ పార్టీకి కంచుకోటగా మారింది. ఇక్కడినుంచి ఆ పార్టీ అధినేత సతీమణి డింపుల్‌ యాదవ్‌ మళ్లీ పోటీ చేస్తున్నారు. 1996 నుంచి ఈ స్థానంలో ఎస్పీ వరుస విజయాలు సాధిస్తోంది.

ఎలా సాధ్యమైంది?

మైన్‌పురీ లోక్‌సభ స్థానం పరిధిలోనే ములాయం స్వగ్రామమైన సైఫైఈ ఉంది. ఈ గ్రామం జశ్వంత్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. ములాయం, అఖిలేశ్‌ ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు. రహదారులు, ఆసుపత్రులు, అన్ని గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించారు. దీంతో ఎస్పీని ప్రతీ ఎన్నికలోనూ ఇక్కడి ఓటర్లు ఆదరిస్తున్నారు. ములాయంసింగ్‌ యాదవ్‌ 1996లో తొలిసారి ఇక్కడినుంచి ఎంపీగా గెలిచారు. అప్పటినుంచి వారి హవా కొనసాగుతోంది.

తీవ్రమైన పోటీ

2019లో ములాయంసింగ్‌ మృతి చెందడంతో జరిగిన ఉప ఎన్నికల్లో అఖిలేశ్‌ సతీమణి డింపుల్‌ యాదవ్‌ ఘనవిజయం సాధించారు. 2019లో బీఎస్పీ, కాంగ్రెస్‌లతో కూటమి ఉండటంతో ఎస్పీ అవలీలగా విజయం సాధించింది. తాజా ఎన్నికల్లో బీఎస్పీ కూడా బరిలో ఉండటంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలే అవకాశముంది. దీన్ని గ్రహించిన ఎస్పీ అభ్యర్థిని డింపుల్‌.. నియోజకవర్గంలో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. భాజపా నుంచి రాష్ట్ర మంత్రి జైవీర్ పోటీ చేస్తున్నారు. పక్కనే ఉన్న కన్నౌజ్‌ నుంచి అఖిలేశ్ బరిలో నిలిచారు. ఈసారి ఎలాగైనా ఎస్పీని కట్టడి చేసి విజయం సాధించాలని కమలదళం ప్రయత్నిస్తుండగా.. మరోసారి విజయం సాధించి ‘ఎర్ర టోపీ’ జోరును కొనసాగించాలని అఖిలేశ్‌ ఆశిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img