icon icon icon
icon icon icon

PM Modi: ఓటు హక్కు వినియోగించుకున్న ప్రధాని మోదీ

PM Modi: అహ్మదాబాద్‌లోని నిషాన్‌ పబ్లిక్‌ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ప్రధాని మోదీ ఓటేశారు.

Published : 07 May 2024 08:21 IST

అహ్మదాబాద్‌: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గాంధీనగర్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని అహ్మదాబాద్‌లో ఓటేశారు. ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైన కాసేపటికే ఆయన రాణీప్‌ ప్రాంతంలోని నిషాన్‌ పబ్లిక్‌ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌కు చేరుకున్నారు. గాంధీనగర్‌ నుంచి బరిలో ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆ సమయంలో ప్రధానితో పాటే ఉన్నారు.

అంతకుముందు సార్వత్రిక సమరం మూడో విడతలో ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్‌లో పాల్గొనాలని మోదీ పిలుపునిచ్చారు. కొత్త రికార్డు సృష్టించాలని కోరారు. అందరి భాగస్వామ్యంతోనే ప్రజాస్వామ్యం మరింత పటిష్ఠమవుతుందని పేర్కొన్నారు. పోలింగ్‌ బూత్‌ పరిసరాల్లోకి పెద్ద ఎత్తున తరలివచ్చిన తన మద్దతుదారులను ఓటేసిన అనంతరం మోదీ పలకరించారు. అభివాదం చేస్తూ ఉత్సాహపరిచారు. పెద్ద సంఖ్యలో పోలింగ్‌లో పాల్గొనాలని మరోసారి కోరారు.

మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్‌లో ఇప్పటికే సూరత్‌ నియోజకవర్గంలో భాజపా అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 25 సీట్లకు నేడు పోలింగ్‌ జరుగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img