డ్రైవర్‌కు రూ.2లక్షలు దొరికింది.. ఏం చేశాడంటే?

అభిమానమంటే ఇష్టమైన హీరో సినిమా చూసి, ఆరాధించడమే కాదు.. వారు చూపిన మంచి మార్గం వైపు కూడా అడుగులు వేయడమని నిరూపించారు ఓ ఆటో డ్రైవర్‌. రూ.2 లక్షలు దొరికితే.. దాన్ని పోగొట్టుకున్న వ్యక్తికి ఇవ్వాలనే మంచితనం, వ్యక్తిత్వం లేని సమాజంలో నేడు మనం ఉన్నాం అనడంలో ఆశ్చర్యం లేదు. అదును దొరికితే మోసగించాలని

Published : 30 Sep 2020 19:50 IST

చెన్నై: అభిమానమంటే ఇష్టమైన హీరో సినిమా చూసి, ఆరాధించడమే కాదు.. వారు చూపిన మంచి మార్గం వైపు కూడా అడుగులు వేయడమని నిరూపించారు ఓ ఆటో డ్రైవర్‌. విలువైన వస్తువులు లేదా నగదు దొరికితే.. దాన్ని పోగొట్టుకున్న వ్యక్తికి ఇవ్వాలనే మంచితనం, వ్యక్తిత్వం లేని సమాజంలో నేడు మనం ఉన్నాం అనడంలో ఆశ్చర్యం లేదు. అదును దొరికితే మోసగించాలని ప్రయత్నించే వాళ్లు ఎందరో. ఇటువంటి పరిస్థితుల్లో ఓ ఆటో డ్రైవర్‌ ప్రయాణికుడు తన ఆటోలో మర్చిపోయిన రూ.2 లక్షల నగదును తిరిగి అప్పగించాడు. తమిళనాడులోని తిరునెల్వేలిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

మురుగన్‌ (ఆటో డ్రైవర్‌) సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు వీరాభిమాని. అందుకే తన పేరులో రజనీని జత చేసుకుని.. రజనీ మురుగన్‌గా మారాడుª. ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని కష్టం మీద పోషిస్తున్నాడు. ఇటీవల ఆయన ఆటో ఎక్కిన ఓ వ్యక్తి అందులోనే రూ.2 లక్షలు మర్చిపోయి వెళ్లిపోయాడు. కష్టం విలువ తెలిసిన రజనీ మురుగన్‌ దాన్ని తిరిగి ప్రయాణికుడికే అప్పగించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసు డిప్యూటీ కమిషనర్‌ శరవణన్‌ రజనీ మురుగన్‌ దంపతుల్ని ఆహ్వానించారు. వాళ్ల నిజాయితీని మెచ్చి, చిరు కానుకతో సత్కరించారు.

కరోనా కారణంగా రజనీ మురుగన్‌ కుటుంబ సభ్యులు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆయన కుమారుడు అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయినప్పటికీ ఆయన డబ్బును తీసుకోకుండా.. తిరిగి ఇవ్వడం గొప్ప విషయం. ఈ నేపథ్యంలో రజనీ అభిమానులు డ్రైవర్‌ను ప్రశంసిస్తున్నారు. రజనీ అభిమాని అనిపించుకున్నారని కామెంట్లు చేస్తున్నారు. ‘బాషా’ సినిమాలో నటి నగ్మా హీరో రజనీకాంత్‌ ఆటోలో ప్రయాణించి.. వజ్రాలను అందులోనే మర్చిపోయి ఇంట్లోకి వెళ్లిన సన్నివేశం పాపులర్‌ అయిన సంగతి తెలిసిందే. వాటిని తలైవా తిరిగి ఆమెకే అప్పగిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని