‘స్కూలు ఫీజుల్లో 25 శాతం తగ్గింపు’  

గుజరాత్‌లోని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు కోర్సు ఫీజుల్లో 25 శాతం తగ్గించడానికి అంగీకరించినట్లు ఆ రాష్ర్ట విద్యాశాఖమంత్రి భూపేంద్రసిన్హా తెలిపారు. కరోనా నేపథ్యంలో ప్రజల ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు చోటు చేసుకున్నాయని, ఈ క్రమంలో......

Published : 01 Oct 2020 01:26 IST

గాంధీనగర్‌: గుజరాత్‌లోని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు కోర్సు ఫీజుల్లో 25 శాతం తగ్గించడానికి అంగీకరించినట్లు ఆ రాష్ర్ట విద్యాశాఖమంత్రి భూపేంద్రసిన్హా తెలిపారు. కరోనా నేపథ్యంలో ప్రజల ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు చోటు చేసుకున్నాయని, ఈ క్రమంలో పాఠశాలల యాజమాన్యాలు 2020- 2021 విద్యా సంవత్సరానికి గానూ ఫీజుల రాయితీకి అంగీకరించాయని ఆయన వివరించారు. ఈ మేరకు పాఠశాలల యాజమాన్యాలతో విద్యాశాఖ పలుసార్లు చర్చలు జరిపినట్లు ఆయన తెలిపారు. ఈ తగ్గింపు సీబీఎస్‌ఈ పాఠశాలల్లోనూ వర్తింస్తుందని మంత్రి పేర్కొన్నారు. మరోవైపు ప్రైవేటు పాఠశాలలు 30 శాతం మేర ఫీజులు తగ్గించాలని ఒడిశా విద్యాశాఖ అక్కడి యాజమాన్యాలను కోరింది. దీనిపై తుది నిర్ణయం వెలువడాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు