ఏపీలో వైద్య విద్యార్థుల ఉపకారవేతనం పెంపు

ఏపీలో వైద్య విద్యార్థుల ఉపకార వేతనాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు......

Updated : 12 Aug 2020 21:22 IST

అమరావతి: ఏపీలో వైద్య విద్యార్థుల ఉపకార వేతనాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ విద్యార్థుల ఉపకారవేతనాన్ని రూ.19,589లకు పెంచింది. అలాగే, పీజీ మొదటి సంవత్సరం విద్యార్థులకు రూ. 44,075, రెండో సంవత్సరం విద్యార్ధులకు రూ.46,524, మూడో సంవత్సరం విద్యార్ధులకు 48973లకు పెంచుతున్నట్టు తెలిపింది. అలాగే, పీజీ డిప్లొమా తొలి సంవత్సరం విద్యార్థులకు రూ.44,075, రెండో సంవత్సరం విద్యార్ధులకు రూ.46,524; సూపర్‌ స్పెషాలిటీలో మొదటి సంవత్సరం విద్యార్థులకు రూ.48,973;  రెండో సంవత్సరం విద్యార్ధులకు రూ. 51,442లు,  మూడో సంవత్సరం విద్యార్ధులకు 53,869; ఎండీఎస్‌ మొదటి సంవత్సరం విద్యార్థులకు 44,075; రెండో సంవత్సరం విద్యార్థులకు 46524, మూడో సంవత్సరం విద్యార్థులకు రూ.48,973ల చొప్పున చెల్లించనున్నట్టు ప్రభుత్వం  వెల్లడించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని