కిశోర్‌ మృతి పట్ల చంద్రబాబు దిగ్భ్రాంతి

ఏపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు అత్యంత సన్నిహితుడు నలందకిషోర్‌ మృతి పట్ల తెదేపా అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Published : 25 Jul 2020 14:51 IST

అమరావతి: ఏపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు అత్యంత సన్నిహితుడు నలందకిషోర్‌ మృతి పట్ల తెదేపా అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కిశోర్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వైకాపా వేదింపులకు మనస్తాపంతో మృతి చెందడం బాధాకరమని ఆయన అన్నారు. ప్రభుత్వ దుశ్చర్యలను ఖండిస్తున్నట్లు చెప్పారు. ‘‘ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ పెట్టాడని కేసులు బనాయించారు. కరోనా పరిస్థితుల్లో విశాఖ నుంచి కర్నూలుకు తరలించారు. పోలీస్‌స్టేషన్‌ చుట్టూ తిప్పి శారీరకంగా, మానసికంగా వేధించారు. ఈ క్షోభ తట్టుకోలేకే కిశోర్‌ తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఆయన మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి’’ అని చంద్రబాబు డిమాండ్‌ చేశారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని