కొరడాతో కొట్టించుకున్న ఛత్తీస్‌గఢ్‌ సీఎం

ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌ కొరడాతో కొట్టించుకున్నారు. ఆదివారం దుర్గ్‌ జిల్లాలోని జజంగిర్‌ గ్రామంలో జరిగిన గోవర్ధన్‌ పూజలో పాల్గొన్న ఆయన రాష్ర్ట ప్రజలు ఆయురారోగ్యాలతో

Published : 15 Nov 2020 18:00 IST

రాయ్‌పూర్‌ : ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌ కొరడాతో కొట్టించుకున్నారు. ఆదివారం దుర్గ్‌ జిల్లాలోని జజంగిర్‌ గ్రామంలో జరిగిన గోవర్ధన్‌ పూజలో ఆయన పాల్గొన్నారు. రాష్ర్ట ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని చేతి మీద కొరడాతో పలుమార్లు కొట్టించుకున్నారు. ఆ రాష్ర్టంలో ఏటా దీపావళి అనంతరం గోవర్ధన్‌ పూజ జరుగుతుంది. ఈ పూజలో ప్రతి సంవత్సరం పాల్గొనే సీఎం ప్రజల శ్రేయస్సు కోసం కొరడాతో కొట్టించుకునే ఈ సంప్రదాయాన్ని పాటిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని